twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3Dలో 'గబ్బర్ సింగ్' హంగామా ఖరారు

    By Srikanya
    |

    ఇప్పుడు అంతటా 3D హవా నడుస్తోంది. అవతార్ చిత్రం 3D చేసి విడుదల చేయటంతో మొదలైన ఈ హంగామా టైటానిక్ త్రిడీ విజయంతో ఊపందుకుంది. దాంతో భారతీయ భాషల్లో సైతం త్రీడి చిత్రాలు చేయటానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే తమ పాత క్లాసిక్ చిత్రాలను త్రీడి లో కన్వర్ట్ చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ కోవలో తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ షోలే త్రీడి ఫార్మెట్ లో అలరించనుంది. అందులోని గబ్బర్ సింగ్ పాత్ర కు ప్రజలు మరోసారి నీరాజనాలు పట్టడం ఖాయం అంటున్నారు నిర్మాతలు.

    భారతీయ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ గ్రేట్ మూవీగా చరిత్రకెక్కిన సినిమా 'షోలే". ఆగస్టు 15,1975 లో విడుదలైన ఈ సినిమా నేటితో 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదే విధంగా ఈ సంవత్సరం ఆగస్టు 15కి ఈ కన్వర్షన్ పూర్తి చేసి విడుదల చేయటానకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫ్రాంక్ ఫోస్టర్ ఆధ్వర్యంలో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై ఆయన ఏమంటున్నారంటే.. “ఇది మాకు ఛాలెంజింగ్ టాస్క్, ఈ సినిమా 35 ఏళ్ల క్రిందట తీయటం జరిగింది. ఒరిజినల్ ఫిల్మ్ డిజిటల్ కాదు. దీంతోపాటు ఈ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉంది. ప్రతీ ఫ్రేం చాలా జాగ్రత్తగా, సహనంతో చేయాల్సిఉంది" అన్నారు.

    ఈ సినిమాను జి.పి. సిప్పి నిర్మించగా....అతని కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే. 37 ఏళ్ల కిందటే రూ. 3 వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్.

    రెండున్నర సంవత్సరాల ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు. తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది.

    English summary
    'Sholay' movie is now being converted to 3D format using conversion software developed for the movie. The film, which was released on August 15 (Independence day) in 1975, is expected to hit the screens on the Independence Day in 2012 again. 'Sholay' was directed by Ramesh Sippy and produced by GP Sippy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X