గబ్బర్ సింగ్....స్టోరీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతే కాదు ఈ చిత్రం తొలి రోజే సాలిడ్ ఎంటర్ టైనర్ అనే టాక్ సొంతం చేసుకుంది. పరిస్థితి చూస్తుంటే చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానుల కోరిక తీరేలా ఉంది.
సినిమా కథ విషయానికొస్తే....
వెంకట రత్నం నాయుడు (పవన్ కళ్యాణ్) సుహాసిని కొడుకు. సుహాసిని నాగినీడు ని రెండవ పెళ్లి చేసుకుంటుంది. వెంకట రత్నం నాయుడు 'షోలే' చిత్రం నుండి గబ్బర్ సింగ్ పాత్రకు వీర ఫ్యాన్. అప్పటి నుంచి తన పేరును'గబ్బర్ సింగ్'గా మార్చుకుంటాడు . పోలీస్ ఉద్యోగం సంపాదించి తన సొంతూరయిన కొండవీడులోనే పోలిస్ గా పోస్టింగ్ వస్తుంది. ఈ క్రమంలో సిద్దప్ప(అభిమన్యు సింగ్) అనే లోకల్ గుండా గొడవ వస్తుంది. రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న సిద్ధప్పను గబ్బర్ సింగ్ అడ్డకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో భాగ్య లక్ష్మి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు గబ్బర్ సింగ్. సిద్దప్ప చేసే చట్ట వ్యతిరేకమయిన పనులను గబ్బర్ సింగ్ ఆపగలిగాడా? తను అనుకున్నది సాదించడానికి గబ్బర్ సింగ్ ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది తెరపై చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











