‘గబ్బర్ సింగ్’ కొండవీడు పోలీస్
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ 'గబ్బర్ సింగ్' సినిమా స్టోరీ కొండవీడు గ్రామంతో లింగు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. వాస్తవానికి ఈ సినిమా హీందీ దబాంగ్ మూవీకి రీమేక్ అయినప్పటికీ....దర్శకుడు హరిష్ శంకర్ ఈ సినిమాను తెలుగు నేటి విటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేవారని స్పష్టం అవుతోంది. ఇందుకోసం కొండవీడు గ్రామ నేపథ్యాన్ని వాడుకుని సినిమా రూపొందిస్తున్నట్లు యూనిట్ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం.
కొండవీడుతో మెగా ఫ్యాన్స్ కు చాలా అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన పలు సినిమాల్లో కొండవీడు నేపథ్యం ఉంది. 'గబ్బర్ సింగ్' ఫస్ట్ లుక్ ఫోటోలను ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. ఈ ఫోటోల్లో పోలీస్ గెటప్ లో ఉన్న పవన్ డ్రెస్సు పై కొండవీడు పోలీస్ అని రాసి ఉండటంతో...సినిమాలోని కొండవీడు నేపథ్యం ఉందనే విషయం బయట పడింది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. చట్టం చూపిన దారిలో వెళితే నేరస్తులను అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే గబ్బర్ సింగ్ తనదైన శైలిలో రౌడీలకు రౌడీగా తన తడాఖా చూపిస్తూ ఉంటాడు.


Click it and Unblock the Notifications











