దిల్ రాజుపై బలవంతంగా..(గబ్బర్‌సింగ్ సక్సెస్ మీట్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యలు శుక్రవారం సాయంత్రం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈకార్యక్రమానికి హాజరైన నిర్మాత, గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ముఖానికి.... నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ కలిసి బలవంతంగా కేక్ క్రీమ్ పూసే సీన్ నవ్వు తెప్పించింది.
ఈ సందర్బంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ...పవన్ నుంచి నేను నేర్చుకున్న నిజాయితీ, నిబద్దత, కఠిన క్రమ శిక్షణే ఈ సక్సెస్‌కి కారణం. ఒక దర్శకుడిలా కాక ప్రేక్షకుడిగా సినిమా చూసి చాలా ఎగ్జైటింగ్ ఫీలయ్యాను. పవన్ ఇన్‌స్పిరేషన్‌తో నేను ఈ సినిమాని ఇంత బాగా తీయగలిగాను. ఏ విధంగా అయితే పవన్‌ని అనుకున్నానో అలాగే చూపించాను. నాకంటే పెద్ద దర్శకులు నన్ను అభినందిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తనకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...పవన్‌తో తాను తీసిన గత సినిమా 'తీన్ మార్' నా కల నెరవేర్చలేక పోయింది. గబ్బర్ సింగ్ సక్సెస్‌తో నా కోరిక తీరింది. నన్ను మార్కెట్లో పెద్ద దర్శకుడిగా నిలబెడతానన్న పవన్ కళ్యాణ్ గారి మాట నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయానికి కారణమైన చిత్రయూనిట్ కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
గబ్బర్ సింగ్ చిత్రం యెక్క నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాట్లాడుతూ...గత సంవత్సరం 'గబ్బర్ సింగ్' లోగో విడుదలైనప్పుడే ఈ చిత్రం నైజాం రైట్స్ కొనాలని డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి ప్రయత్నింస్తుంటే 6 నెలల తర్వాత డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు. నేను ఇది వరకు తీసుకున్న తొలిప్రేమ, ఖుషి చిత్రాలతో పాటు గబ్బర్ సింగ్ చిత్రం కూడా సెన్షేషన్ క్రియేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications











