గబ్బర్ సింగ్ కి సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ అటెన్షన్ లో పెడుతున్నారు...
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో మున్నీగా ఎవరు చేస్తారనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అయితే ఎవరికి తోచినట్లు వారు... తలా ఓ పేరు మాత్రం చెప్పేస్తున్నారు. రోజుకో పేరు వినిపిస్తూనే ఉంది. షూటింగ్ స్టార్ట్ అయినా దర్శక నిర్మాతలు మాత్రం మున్నీ పేరును ఇంకా ఖరారు చేయట్లేదు. ఒకవేల వారి మదిలో ఎవరినైనా అనుకొని ఉన్నా రివీల్ చేయట్లేదు. ఇలాగే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ... సినిమాపై అటెన్షన్ ఉండేలా చూసుకుంటున్నారు. తమిళంలో దబాంగ్ రీమేక్ గా శింబు హీరోగా వస్తున్న ఓస్తీ చిత్రంలో మాత్రం మల్లికా షెరావత్ మున్నీగా తమిళ తంభీల పూసాలు కదిలించనుంది. అందుకే తెలుగు మున్నీ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఇటీవలే మహేష్ దూకుడు సినిమాలో పువ్వాయ్, పువ్వాయ్ అంటూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పార్వతీ మెల్టనే టాలీవుడ్ మున్నీ అంటూ ఓ వర్గం బలంగా ప్రచారం చేస్తోంది. హీరో పవన్ తో పాటు దర్శకుడు హరీష్ కూడా పార్వతి వైపే మొగ్గు చూపిస్తున్నారట. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ని ఐటం సాంగ్ తో సూపర్ స్టార్ట్ చేసిన పార్వతి రాబోయే రోజుల్లో టాప్ హీరోయిన్ అవ్వాలని కలలు కంటోంది.
కానీ... దూకుడులో ఐటం సాంగ్ హిట్టవ్వడంతో చాలామంది ప్రత్యేక గీతాల కోసం సంప్రదిస్తున్నారట. పారూ మాత్రం వెంటనే ఏదీ ఒప్పుకోవట్లేదట. అయితే పవన్ తో జల్సా చేసిన అనుభవముంది కాబట్టి.. ఆ రిలేషన్ తో మున్నీగా తెలుగ ప్రేక్షకుల బాడీల్ని హీటెక్కిస్తుందని అంచనా వేస్తున్నారు. అసలు టాలీవుడ్ మున్నీ ఎవరో తెలియాలంటే మాత్రం మరికొద్దికాలం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











