'గబ్బర్ సింగ్' టైటిల్ పెట్టిందెవరంటే...
ఎవరికీ తెలియదు కానీ... ఈ సినిమాకి నామకరణం పవన్ కళ్యాణ్ చేశారు. 'గబ్బర్ సింగ్' అనే పేరు ఆయన సూచించినదే. తొలిసారి నేను ఆయన్ని కలిసినప్పుడు... సినిమా పేరు చెప్పి పూర్తిస్థాయిలో వినోదం ఉండాలన్నారు అంటున్నారు హరీష్ శంకర్. ఆయన తాజా చిత్రం 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్టైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే... వినోదం విషయంలో ఆయన నన్ను నమ్మినందుకు చాలా సంతోషించాను. నాకు కొంచెం సమయమివ్వండని అడిగాను. ఆర్నెల్లు కష్టపడి ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం అని చెప్పుకొచ్చారు.
ఇక సినిమా విజయం పై స్పదిస్తూ... 'గబ్బర్ సింగ్' సినిమా ఫలితంతో నేనొక దర్శకుడిగా కంటే... పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎక్కువ సంతోషిస్తున్నాను.'తొలిప్రేమ', 'ఖుషి' చిత్రాల తర్వాత మళ్లీ అసలు సిసలైన పవన్ కళ్యాణ్ సినిమాని చూపించారని అభిమానులు అంటున్నారు. తొలి రోజు, తొలి ఆటే ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాను. ప్రతి సన్నివేశాన్నీ వాళ్లు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా ఎంతోమంది స్పందించారు. రాజమౌళి, వినాయక్, శ్రీను వైట్ల తదితర దర్శకులంతా పవన్ కళ్యాణ్ని చాలా శక్తిమంతంగా తెరపై చూపించావని అభినందించడం ఆనందాన్నిచ్చింది అన్నారు.
సినిమా సక్సెస్ వెనక సీక్రెట్ వివరిస్తూ... సినిమా అనేది ప్రేక్షకులందరికీ నచ్చాలి. అభిమానులకు ఇంకొంచెం ఎక్కువ నచ్చాలి. ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేశాను.''అన్నారు హరీష్ శంకర్. ఇక ''హిట్టు..ప్ లాప్ లను నమ్ముకొని నేను పరిశ్రమకు రాలేదు. కేవలం పనిని నమ్ముకొని వచ్చాను. వరుసగా రెండు విజయాలు అందుకోవడమంటే... ఒక దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగినట్లే అని ఖచ్చితంగా చెప్పారు.
దబాంగ్ లో మార్పులు చేయటంపై స్పందిస్తూ... హిట్టన సినిమా అయినా తెలుగులో చేసేటప్పుడు మార్పలు అవసరమే. మన ప్రేక్షకుల అభిరుచి, మన హీరోల ఇమేజ్‌కి తగ్గ విధంగా మంచి మార్పులు చేసుకోవాలి. 'దబాంగ్'లో హీరో లంచం తీసుకోవడం ఉంటుంది. కానీ నా వరకూ అది నచ్చలేదు. మార్చాను. 'దబాంగ్' కథ బాలీవుడ్‌కి కొత్తే. దానికి భిన్నంగా సినిమా తియ్యాలని కొన్ని మార్పులు చేశాను. ఇదొక రీమేక్ చిత్రం కాబట్టి... మన నేపథ్యానికి అనుగుణంగా చాలా మార్పులే చేసుకొన్నాం. 'దబాంగ్' లోని ప్రతి సన్నివేశాన్నీ విశ్లేషిస్తూ ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. అందుకే కొంచెం ప్రాసతో మాటలు, మార్పులు అని రాశాను. వినోదంలో భాగంగానే ఆ ఆలోచన వచ్చింది. మేం ఊహించినట్టుగానే థియేటర్లో నవ్వుకోవడం అక్కడ్నుంచే మొదలైంది అంటూ హరీష్ శంకర్ వివరించారు.


Click it and Unblock the Notifications











