'గబ్బర్ సింగ్' టైటిల్ సాంగ్ లీకైన లిరిక్స్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో టైటిల్ సాంగ్ లిరిక్స్ లీక్ అయ్యాయి. బాగా సెహగల్ పాడిన ఈ పాటలో లిరిక్స్ ఇలా ఉంటాయి...గబ్బర్ సింగ్..గబ్బర్ సింగ్...కళ్లళ్లో పైరింగ్..గబ్బర్ సింగ్...మన చేతి దెబ్బ తిన్నోళ్లు మళ్ళీ లెగరు...గబ్బర్ సింగ్..గబ్బర్ సింగ్..గబ్బర్ సింగ్ అంటూ సాగుతుంది ఆ పాట. ఇక ఈ లిరిక్స్ అక్షయ్ కుమార్ సూపర్ హిట్ సినిమా సింగ్ ఈజ్ కింగ్ లోని టైటిల్ సాంగ్ ని గుర్తు తెస్తోందంటున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ ఈ మధ్యనే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జనవరి 29న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే షెడ్యూల్ తో ఈ చిత్రం షూటింగ్ మాగ్జిమం కంప్లీట్ అయ్యిపోయినట్లే.
ఏప్రియల్ 27న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నాడు. దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో డైలాగులకు ప్రయారిటీ ఉన్నందువల్లే ఈ చిత్రానికి హరీష్ ని ఎంచుకున్నాడని చెప్తున్నారు. తన మాస్ డైలాగులతో హరీష్ అభిమానులు చేత టప్పట్లు కొట్టిస్తాడని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీజర్ లో చెప్పిన నాకు కొంచెం తిక్కుంది..కాకపోతే దానికో లెక్క ఉంది అన్న డైలాగు అందరి చేతా శభాష్ అనిపించుకుంది.


Click it and Unblock the Notifications











