Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ లీక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రం హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిది. మిగతా భాగాన్ని త్వరలోనే పూర్తి చేసి ఏప్రిల్ 27న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ చివరి షెడ్యూల్ జనవరి 29 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
తాజాగా గబ్బర్ సింగ్ చిత్రానికి చెందిన టైటిల్ సాంగ్ లీక్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రముఖ సింగర్ బాబా సెహగల్ ఈ పాటను మాంచి జోష్ ఉన్న బీట్ మధ్య ఆలకించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
''గబ్బర్ సింగ్..గబ్బర్ సింగ్..కళ్లలో ఫైరింగ్...గబ్బర్ సింగ్...మన చేతి దెబ్బతిన్నోళ్లు మళ్లీ లెగరు...గబ్బర్ సింగ్..గబ్బర్ సింగ్'' అంటూ ఈ పాట సాగుతుంది. అయితే ఇది నిజంగా సినిమాలోని పాటేనా? కాదా? అనేది తేలాల్సి ఉంది.