దేఖో దేఖో గబ్బర్ సింగ్ షురూ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని టైటిల్ సాంగ్ 'దేఖో దేఖో గబ్బర్ సింగ్' చిత్రీకరణ నేటి నుంచి ప్రారంభం అయింది. హైదరాబాద్ గబ్చిబౌలి ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో అద్భుతంగా పాటను పిక్చరైజ్ చేస్తున్నారు.
ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా...బాబా సెహగల్, నవీన్ మాధవ్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి జోష్ ఉన్న మ్యూజిక్ అందించారు. టైటిల్ సాంగు కావడంతో చిత్రీకరణ విషయంలో విభిన్నతను చాటుతున్నారు. పలు సామాజిక అంశాలు పాటలో ప్రతిబింభించే విధంగా చూస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా రూపొందుతున్న ఈచిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ శ్రీపరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్టయిన దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. పవర్ స్టార్ ఈ చిత్రంలో కొండవీడు పోలీస్‌గా కనిపించబోతున్నారు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











