నితిన్ తో పాటే థియేటర్లకి పవన్ కళ్యాణ్
నితిన్ తాజా చిత్రం ఇష్క్ ఆడియో పంక్షన్ కి పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇష్క్ చిత్రం తో పాటు పవన్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ట్రైలర్స్ ధియోటర్లను అలరించనున్నట్లు సమాచారం. పిబ్రవరి 24న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇదే రోజున గబ్బర్ సింగ్ టీజర్ ని నేరుగా ధియోటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇష్క్ ఆడే థియేటర్లు అన్నటిలోనూ ఈ టీజర్ ప్రదర్శించబడుతుంది. ఇక గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. మిరపకాయతో నిరూపించుకున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హిట్టైన దబాంగ్ కి ఇది రీమేక్. ఇందులో పవన్ మాస్ లుక్ తో కూడిన పోలీస్ అధికారిగా కనపిస్తారు.
పవన్ 'గబ్బర్ సింగ్'లో ఓ ఢిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించి అలరించనున్నాడు. ఆ క్యారక్టైజేషన్ గురించి యూనిట్ వర్గాలు చెప్తూ...చేసే పోలీస్ ఉద్యోగాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఎదురున్న శత్రువుని కూడా తేలిగ్గానే తీసుకుంటాడు. లంచగొండి తనాన్నీ తేలిగ్గానే తీసుకుంటాడు. కావాలనుకుంటే తను కూడా లంచం తీసుకుంటాడు. కొట్టాలనిపిస్తే ఎవర్నయినా కొట్టేస్తాడు. మూడ్ లేకపోతే... ఎవర్నయినా వదిలేస్తాడు. కానీ అమ్మ, నాన్న, తమ్ముడు... ఇలాంటి సెంటిమెంట్లను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ఇలాంటి డిఫరెంట్ కేరక్టరైజేషన్ పవన్ ఇంతకు ముందు చేయలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ అబిమానులను ఆకట్టుకున్నది ఇది. ఈ చిత్రంలో...పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











