‘గబ్బర్ సింగ్’ వీడియో గేమ్, ఇక మీ సత్తా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం హిస్టారికల్ మాస్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విడుదలైన 10 రోజుల్లోనే 50 కోట్లకు పై చిలుకు వసూళ్లు సాధించి తెలుగు సినిమా రికార్డుల చరిత్రను తిగరాసింది. 'గబ్బర్ సింగ్'క్రేజ్ మరింత పెంచేందుకు నిర్మాతల సరికొత్త ఆలోచనలో ముందుకు వస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం...'గబ్బర్ సింగ్' వీడియో గేమ్ అందుబాటులోకి తేవాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, చెన్నయ్‌లలోని ప్రముఖ గేమింగ్ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. సినిమా మాదిరే సాగే ఈ గేమ్‌లో 'గబ్బర్ సింగ్'ను మనం కంట్రోల్ చేస్తూ మజా చేయొచ్చట.
పవర్ స్టార్‌కి యూత్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఈ వీడియో గేమ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా ఒక మంచి కిక్ ఇచ్చే గేమ్ అవుతుందో లేదో చూడాలి.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











