యువ హీరోయిన్‌పై గచ్చిబౌలి పోలీసుల కొరడా.. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో ఉన్న ప్రిజమ్ పబ్‌లో తన బర్త్ డే సందర్భంగా జరుపుకొన్న పార్టీలో యువ తార కల్పిక గణేష్ రచ్చ చేయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. కల్పిక తన స్నేహితులతో కలిసి వెళ్లి పబ్ యాజమాన్యంతో గొడవకు దిగింది. సోషల్ మీడియాలో లైవ్ పెట్టి వారిపై ఆరోపణలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అక్కడికి రావడంతో వారిపై కూడా కామెంట్ చేయడం ఈ వివాదంలో భాగమయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో గచ్చిబౌలి పోలీసులు ఆమెపై కొరడా ఝలిపించేందుకు సిద్దమయ్యారు. కల్పికపై పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల్లోకి వెళితే..

ప్రిజమ్ పబ్‌లో ఆహార పదార్థాల నాణ్యత సరిగా లేవు. అలాగే తనతో వారి ప్రవర్తన దురుసుగా ఉందంటూ వాగ్వాదానికి దిగారు. బిల్ చెల్లింపులో గొడవ జరగడంతో దాదాపు గంటన్నర సేపు పబ్ యాజమాన్యంతో రచ్చ చేసింది. ఆ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. పబ్ యాజమాన్యం పట్ల పోలీసులు ఉదారంగా వ్యవహరించారు. వారు గొడవను చూస్తూ ఆడియెన్స్‌ మారిగా చూస్తూ నిలుచున్నారు. దాంతో గచ్చిబౌలి పోలీసుల తీరు చూసిన తర్వాత ఈ గొడవలో నాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదు అని కల్పిక ఆరోపణలు చేసింది.

Actress Kalpika

అయితే ఇన్స్‌టాగ్రామ్‌లో తన సబ్‌స్క్రైబర్లను పెంచుకొనేందుకు ఈ చీప్ ట్రిక్ పన్నారనే విషయం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. నెటిజన్లు కొందరు ఆమెపై దారుణంగా కామెంట్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ వివాదంలో కల్పికకు భారీగానే ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఘటనలో కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేయడం ట్విస్టుగా మారింది. అయితే ఆమెను ఈ కేసులో విచారిస్తారా? లేకా అరెస్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

గత నెల అంటే మే 29వ తేదీన ప్రిజం పబ్‌లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టడంపై కల్పికపైయ ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. పబ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కోర్టు అనుమతితో పోలీసులు జాగ్రత్తగా కేసును ఫైల్ చేశారు అని తెలిసింది.

ప్రిజం పబ్ ఫిర్యాదును స్వీకరించిన గచ్చిబౌలి పోలీసులు BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఆమెపై 324(4),352,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను కోర్టు నిబంధనలు, ఆదేశాలకు అనుగుణంగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై కల్పిక ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X