Gaddalakonda Ganeshపై మెగాస్టార్, సూపర్ స్టార్ కామెంట్స్.. ఇదీ డైరెక్టర్ రియాక్షన్

తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీ. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. తాజాగా ఈ సినిమాపై చిరంజీవి, మహేష్ బాబు తమ తమ అభిప్రాయాలు చెప్పారు.

వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్‌

వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్‌

వరుణ్ తేజ్ క్యారెక్టర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. తన క్యారెక్టరైజేషన్‌తో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరికీ ఆకట్టుకున్నారు అందుకుంటున్నారు వరుణ్. దీంతో మొదటి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని నేటికీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ ముందుకెళ్తున్నాడు గద్దలకొండ గణేష్‌. వరుణ్ క్యారెక్టర్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ కామెంట్

తాజాగా ట్విట్టర్ వేదికగా గద్దలకొండ గణేష్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. ''గద్దలకొండ గనేష్ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ యాక్షన్ అదిరింది. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అద్భుతంగా తెరకెక్కించారు. గద్దలకొండ గణెష్ సినిమా టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు'' అని తెలిపారు మహేష్.

గద్దలకొండ గణేష్ చుసిన చిరంజీవి

గద్దలకొండ గణేష్ చుసిన చిరంజీవి

ఇక గద్దలకొండ గణేష్ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి.. తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, హరీష్ శంకర్ సినిమాను బాగా హ్యాండిల్ చేశారని, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు చిరంజీవి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు తెరకెక్కించిన తీరు, గద్దలకొండ గణేష్ టీమ్ స్పిరిట్ ఈ అద్భుత విజయాన్ని సాధించి పెట్టిందని, అందరికీ విజయాభినందనలు అని తెలిపారు.

డైరెక్టర్ రియాక్షన్

మహేష్ చేసిన ట్వీట్‌ పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. స్టార్ హీరోలంతా గద్దలకొండ గణేష్ సినిమాను ప్రశంసించడం పట్ల ఆయన అందరికీ కృతజ్ఞతలు ఆయన తెలిపారు. మెగా ప్రిన్స్ పై కురుస్తున్న ఈ ప్రశంసలు చూసి మెగా అభిమానులు ఆనంద పడుతున్నారు.

బాక్సాఫీస్ జోరు

బాక్సాఫీస్ జోరు

మరోవైపు బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ జోరు కొనసాగుతూనే ఉంది. ఐదో రోజు కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ రిపోర్ట్ నమోదు చేసింది. విడుదలకు ఒక్క రోజు ముందే వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్‌గా ఈ సినిమా పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ ప్రభావం ఈ సినిమా పై పడకుండా విజయవంతంగా రన్ అవుతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆనందం చిగురింప జేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X