వరంగల్ పయనమైన వరుణ్ తేజ్.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గత్తరలేవాల!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో గద్దలకొండ గణేష్ హవా నడుస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీన విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా మొదటి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ రోజురోజుకూ జోష్ పెంచుకుంటూ పోతున్నాడు గద్దలకొండ గణేష్.

విడుదలకు ముందు పలు వివాదాల్లో చిక్కుకున్న గద్దలకొండ గణేష్ సినిమా విడుదలయ్యాక సత్తా చాటుతోంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయం గద్దలకొండ గణేష్ చిత్రయూనిట్ మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తుతోంది. దీంతో సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు యూనిట్ సభ్యులు. ఈ మేరకు నేడు (సెప్టెంబర్ 24) విజయోత్సవ యాత్ర ప్రారంభించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పర్యటన కొనసాగనుంది.

 Gaddalakonda Ganesh Success Tour Starts From Warangal

గద్దలకొండ గణేష్ విజయోత్సవ యాత్ర ఈ రోజు (మంగళవారం) వరంగల్ నుంచి మొదలుకొని శుక్రవారం రోజు వైజాగ్‌లో ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లోని మెగా అభిమానులను కలవబోతున్నారు గద్దలకొండ గణేష్ యూనిట్ సభ్యులు. ఇక ఈ యాత్రలో వరుణ్ తేజ్ లేపబోయే గత్తర మామూలుగా ఉండదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో గత్తర లేపి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారట వరుణ్ తేజ్.

మరోవైపు బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ జోరు కొనసాగుతూనే ఉంది. నాలుగో రోజు కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ రిపోర్ట్ నమోదు చేసింది. విడుదలకు ఒక్క రోజు ముందే వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్‌గా ఈ సినిమా పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ ప్రభావం ఈ సినిమా పై పడకుండా విజయవంతంగా రన్ అవుతుండటం ట్రేడ్ వర్గాల్లో ఆనందం చిగురింప జేస్తోంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X