గడ్డం గ్యాంగ్ : డాన్స్ చేసిన రాజశేఖర్ కూతుర్లు (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: రాజశేఖర్ హీరోగా రూపొందుతోన్న 'గడ్డం గ్యాంగ్' చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితారాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ చిత్రం 'సూదుకవ్వమ్' కి ఇది రీమేక్. పి.సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన షీనా హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు సంగీతం అందించారు.

ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్ హాజరై సీడీలను ఆవిష్కరించి కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డికి అందజేసారు. అనంతరం జవదేవకర్ ఆసక్తికరంగా మాట్లాడి నవ్వులు పూయించారు. రాజశేఖర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయనకు ఈ సినిమాలోని గెటప్ కోసం గడ్డం పెంచారు. నాకు కూడా గడ్డం ఉంది. కాబట్టి నేను కూడా గడ్డం గ్యాంగ్ లో మెంబర్ నే అంటూ చలోక్తులు విసిరారు.

ఈ ఆడియో వేడుకలో రాజశేఖర్, హీరోయిన్ షీనాలతో పాటు రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక, నరేష్ తదితరులు కూడా డాన్స్ చేసి అలరించారు. అందుకు సంబందించిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో...

సీడీని ఆవిష్కరిసున్న ప్రకాష్ జవదేకర్

సీడీని ఆవిష్కరిసున్న ప్రకాష్ జవదేకర్


''రోటీన్ సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే సినిమాలు తగ్గించి చేస్తున్నాను. 'సూదుకవ్వమ్' చిత్రం నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి అంగీకరించాను. సినిమా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇకపై డిఫరెంట్ సినిమాలు చేస్తాను'' అని రాజశేఖర్ అన్నారు.

ఆడియో వేడక

ఆడియో వేడక


సంగీత దర్శకుడు అచ్చు మాట్లాడుతూ - ''తమిళ వెర్షన్ పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. తెలుగులో నేను కూడా మంచి పాటలు చేసాను. అందరికీ నచ్చే విధంగా ఈ పాటలు ఉంటాయి'' అన్నారు.

డాన్స్ చేస్తున్న రాజశేఖర్ కూతురు

డాన్స్ చేస్తున్న రాజశేఖర్ కూతురు


జీవితారాజశేఖర్ మాట్లాడుతూ - ''ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేసి, మేము బాగా నష్టపోయాం. ఈ సినిమాకి చాలామంది డబ్బు తీసుకోకుండానే వర్క్ చేసారు. మేం అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. కాబట్టి మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

శివారెడ్డితో రాజవేఖర్ కూతురు డాన్స్

శివారెడ్డితో రాజవేఖర్ కూతురు డాన్స్


ఈ వేడుకలో పాల్గొన్న బిజెపి నేత కిషన్ రెడ్డి, సాయికుమార్, పోకూరి బాబురావు, సీనియర్ నరేష్, డైరెక్టర్ సంతోష్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

రాజశేఖర్, షీనా డాన్స్

రాజశేఖర్, షీనా డాన్స్


గిరిబాబు, సీనియర్ నరేష్, సీత, దీపక్, అచ్చు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి - డేమిల్ జేవియర్, సంగీతం - అచ్చు, ఎడిటర్ - రిచర్డ్ కెవిన్, నిర్మాత - జీవితారాజశేఖర్

సందడిగా సాగింది

సందడిగా సాగింది


ఈ కార్యక్రమం మొత్తం ఎంతో సందడిగా సాగింది. రాజశేఖర్ తో పాటు నరేష్, తదితరులు కూడా డాన్స్ చేసారు.

ప్రకాష్ జవదేకర్‌తో

ప్రకాష్ జవదేకర్‌తో


కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో కలిసి రాజశేఖర్ ఫ్యామిలీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X