దీపావళి స్పెషల్: ‘గడ్డం గ్యాంగ్’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడిగా 'గడ్డం గ్యాంగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. తమిళంలో విజయవంతమైన 'సూదుకవ్వుమ్' చిత్రానికి రీమేకిది.
'జర్నీ' ఫేం శరవణన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివాజీ శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్నారు. 'పంజా' ఫేమ్ అంజలి లావానియా రాజశేఖర్ సరసన కథానాయికగా నటిస్తోంది.

కామెడీ థ్రిల్లర్‌గా రూపొందనున్న త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నరేష్, సీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డేమిల్ గ్జావియర్ ఎడ్వర్ట్స్, సంగీతం: అచ్చు, ఆర్ట్: వెంకట్, నిర్మాత: జీవితారాజశేఖర్.


Click it and Unblock the Notifications











