హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ రాజశేఖర్ ఇలా...(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : రాజశేఖర్‌ తనను తాను ఇంకా యంగ్ హీరోలా ఫీలవుతున్నట్లున్నారు. ఇంకా రొమాంటిక్ సన్నివేశాల్లో ఇరగదీసాద్దామనే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం 'గడ్డం గ్యాంగ్‌'. షీనా ని హీరోయిన్ గా పెట్టుకుని షూటింగ్ మొదలెట్టారు. షీనా ఎవరో గుర్తుందా...మంచు మనోజ్ బిందాస్ సినిమా హీరోయిన్. పి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళంలో విజయం సాధించిన 'సూదుకవ్వుమ్‌'కిది రీమేక్‌. జీవితా రాజశేఖర్‌ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఫొటోలు విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అచ్చు, నోయల్‌, మహి ఇల్లింద్రా, షీనా తదితరులు పాల్గొన్నారు

ఈ ఫొటోలు చూసిన వాళ్లు రాజశేఖర్ ఇంకా రొమాంటిక్ హీరోలా ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం ఏంటి అంటున్నారు. యాక్షన్ కామెడీ కాబట్టి ఆ తరహా ఫొటోలను షూట్ చేసి విడుదల చేస్తే బాగుండేదని చెప్తున్నారు. అంతేకాక ఈ సినిమా థీమ్ ని రిప్రజెంట్ చేయకుండా ఈ ఫొటోలు ఏదో మసాలా చిత్రం చేస్తున్నట్లు ఉన్నాయని అంటున్నారు.

స్లైడ్ షోలో...ఫొటోలు

రాజశేఖర్‌ మాట్లాడుతూ....

రాజశేఖర్‌ మాట్లాడుతూ....

''గడ్డం దాస్‌ అనే వ్యక్తి జీవితంలో జరిగే మలుపులే ఈ చిత్రం. ఇందులో నాతో పాటు మరో నలుగురు యువ నటులు చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లోకెల్లా ఇది వైవిధ్యంగా ఉంటుంది'' అన్నారు.

జీవిత మాట్లాడుతూ ...

జీవిత మాట్లాడుతూ ...


''సూదుకవ్వుమ్‌' సినిమాను తెలుగులో చాలా మంది చేద్దామనుకున్నారు. ఆఖరికి ఆ అవకాశం మాకు దక్కింది. 35 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

''తొలి సన్నివేశం నుంచి కొత్తదనం కూడుకున్న కథ ఇది. రాజశేఖర్‌ నటన, షీనా అందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు దర్శకుడు.

క్రేజ్ వస్తుందనే...

క్రేజ్ వస్తుందనే...


'సూదుకవ్వుమ్‌' చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. దాంతో ఈ రీమేక్ కు ఇక్కడ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

వరస ఫ్లాపులు

వరస ఫ్లాపులు


రాజశేఖర్ కు ఈ మధ్య కాలంలో హిట్ అనేది లేదు. తన భార్య డైరక్షన్ లో చేసిన సినిమాలే కాక,బయిట దర్శకులతో చేసినవి సైతం డిజాస్టర్స్ అయ్యాయి.

కాంట్రవర్శీలతో..

కాంట్రవర్శీలతో..

తమ సినిమాలు ఫెయిలైనా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్శిలతో దంపతులు జీవిత,రాజశేఖర్. ముఖ్యంగా చిరంజీవితో,పవన్ లపై కామెంట్స్ చేసి ఓ వర్గానికి దూరమయ్యారు.

వర్మతో...

వర్మతో...

మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని సైతం రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ విభిన్నంగా తన నేచురల్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఎవరెవరు

ఎవరెవరు


నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. చిత్రానికి ఛాయాగ్రహణం: డేమిల్‌ గ్జావియర్‌ ఎడ్వర్డ్స్‌, సంగీతం: అచ్చు. కళ: వెంకట్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ కెవిన్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X