twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి దారుణం.. ఆరు నెలలుగా డబ్బులు లేక.. గద్దర్ సంచలన వ్యాఖ్యలు

    |

    ఉద్యమాలు, ప్రభుత్వ పనితీరుపై విమర్శనాత్మకంగా సినిమాలను రూపొందించే సంచలన నటుడు ఆర్ నారాయణ మూర్తి తాజాగా రైతన్య అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గ్లోబలైజేషన్‌లో రైతులు పడుతున్న అవస్థల గురించి వెల్లడిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా యుద్ధనౌక గద్దర్ మాట్లాడుతూ..

    గ్లోబలైజేషన్ పేరుతో అంటూ

    గ్లోబలైజేషన్ పేరుతో అంటూ

    గ్లోబలైజేషన్ పేరుతో రైతన్నను దోచుకొంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా రూపొందించే చట్టాలపై నారాయణమూర్తి లాంటి సినిమాను ఆస్త్రంగా రూపొందించుకొని వాస్తవాలను బయటపెడుతున్నారు. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చంటూ వారిని దగా చేస్తున్నారు. ఇక్కడ పండించే పంటను ఢిల్లీలో అమ్ముకోవడం సాధ్యమా? అంటూ గద్దర్ ప్రశ్నించాడు.

     ఆ దగాను ఎదురించే రైతన్న చిత్రం

    ఆ దగాను ఎదురించే రైతన్న చిత్రం

    మార్కెట్, చవకగా దొరికే శ్రామిక దేశాలు, అలాగే లాభార్జనే లక్ష్యంగా కార్పోరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సంస్థల దోపిడిని బట్టబయలు చేయడానికి సినిమాను ఆర్ నారాయణ మూర్తి మాధ్యమంగా ఎంచుకొన్నారు. రైతన్న సినిమా ఆ కోవలోనేది. కార్పోరేట్, రాజకీయ వ్యవస్థలపై విమర్శనాస్త్రంగా ఈ సినిమా రూపొందింది. రైతులపై కార్పోరేట్ సంస్థల దండయాత్రను స్పష్టంగా చూపించారు అని గద్దర్ అన్నారు.

    ఎడ్డిదో.. గుడ్డిదో పెళ్లాం ఉండాలి..

    ఎడ్డిదో.. గుడ్డిదో పెళ్లాం ఉండాలి..

    ఆర్ నారాయణమూర్తి ఆరోగ్యం గురించి గద్దర్ వివరిస్తూ.. గత ఎనిమిది నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో నీవు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మా ఇంటికి రండి అని పిలుస్తా. కానీ ఆయన రాడు. సొంత ఆస్తి అంటూ లేని వ్యక్తి నారాయణమూర్తి. ఇల్లు లేదు. ఎడ్డిదో.. గుడ్డిదో సొంత పెళ్లాం ఉండాలి. అదీ లేదు. సూటు లేదు.. బూటు లేదు. ఒక బండి లేదు. అలా రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తాడు. తెర మీద నటిస్తాడు... కానీ జీవితంలో నటించడు అని గద్దర్ పేర్కొన్నారు.

    నమ్మిన సిద్దాంతం కోసం

    నమ్మిన సిద్దాంతం కోసం


    నారాయణమూర్తి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వారు. అలాంటి లక్షణాలు లేకుంటే సమాజాన్ని ప్రశ్నించలేరు. తాను నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడిన వ్యక్తి అని ఆయనను గద్దర్ ప్రశంసించాడు. కట్టుబడిన సిద్దాంతం కోసం చివరి రక్తం బొట్టును ధారపోసేందుకు సిద్దమయ్యారు అని గద్దర్ అన్నారు.

    Recommended Video

    Allu Arjun Biography | Why Allu Arjun Is Biggest PAN India Star ? | Filmibeat Telugu
     కిరాయి కట్టలేక సిటీకి దూరంగా

    కిరాయి కట్టలేక సిటీకి దూరంగా

    నారాయణమూర్తి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇంటి కిరాయి కట్టలేక సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నారు. ఇంతమంది స్నేహితులుంటే.. ఎక్కడికో వెళ్లడం ఎందుకు అని అడుగుతుంటాను అని గద్దర్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

    English summary
    Folk Singer Gaddar Emotional comments on R Narayana Murthy's health, and financial status. Gaddar Praises for his values and commitment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X