twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందీ అవార్డు పై గద్దర్ స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలంగాణా ఉద్యమంలో మోగిన గీతం 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...'. ఈ పాటను గద్దర్‌ రచించి గానం చేశారు. 'జై బోలో తెలంగాణ' చిత్రంలో గీతమిది. దీనికిగాను గద్దర్‌ని ఉత్తమ గాయకుడిగా నంది జ్యూరీ ఎంపిక చేసింది. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''ఉద్యమం కోసం గొంతు విప్పిన ఓ గీతానికి లభించిన పురస్కారంగా భావిస్తున్నాను. 'అమరవీరులకు ఈ అవార్డు అంకితం..' అని చెప్పను. ఎందుకంటే వారి త్యాగాల ముందు ఇది చాలా చిన్నది. తెలంగాణ సాధనే వారికి సరైన బహుమతి'' అన్నారు.

    'జైబోలో తెలంగాణ' చిత్రానికిగాను ఆయనకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం లభించింది. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ... 'జై బోలో తెలంగాణ' కథ కాదు. ఓ ఉద్యమం. తెలంగాణ ప్రజల మనోభావాలకు తెరరూపం. ఈ సృజనను, ఆవేదనను, ఆర్తిని అర్థం చేసుకొన్న న్యాయ నిర్ణేతలకు నా కృతజ్ఞతలు. ఇది వరకు కూడా నేను సినిమాలు తీశాను. వ్యక్తిగతంగా పురస్కారాలు దక్కాయి. అయితే.. ఎక్కువ ఆనందాన్ని అందించిన నంది ఇదే. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి గౌరవం దక్కినా అది తెలంగాణ పోరాట యోధులకు, ప్రజలకు అంకితం అన్నారు.

    అలాగే ఓ సమస్యను తెరపై చూపించాలనుకొన్నప్పుడు డాక్యుమెంటరీ లక్షణాలు సినిమాకి అంటకుండా దాటుకుంటూ వెళ్లడం కష్టం. ఆ సమస్యను ఎలా అధిగమించారు..? బహుశా ఈ విషయంలోనే జ్యూరీ నా ప్రతిభ గుర్తించి ఉంటుందేమో? ఓ సినిమా తీయాలనుకొన్నప్పుడు ఓ కథ రాసుకొంటాం. సన్నివేశాలు అల్లుకొంటాం. దాని ప్రకారం చిత్రీకరణ జరుపుతాం. కానీ రాసుకోవడానికి ఇది కథ కాదు. ఉద్యమం. సినిమా మొదలైనప్పటి నుంచీ విడుదలైనంత వరకూ ఉద్యమం వివిధ రూపాలు సంతరించుకొంది. మరో వైపు ప్రభుత్వం కమిటీలపై కమిటీలు వేస్తోంది. విద్యార్థులు, మేధావుల మనోభావాలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. వీటన్నింటినీ తెరపై చూపించడం కత్తి మీద సామే అని చెప్పుకొచ్చారు.

    'జైబోలో తెలంగాణ' సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. దర్శకుడిగా. ఎక్కువ ఆనందం... కెప్టెన్‌గానే దక్కింది. జాతీయ సమగ్రత విభాగంలో పురస్కారం దక్కడం కూడా సంతోషమే. గాయకుడు గద్దరన్నకి నా శుభాకాంక్షలు. ప్రస్తుతం ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకొనే సినిమాలు తీస్తున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. సినిమాకి సామాజిక బాధ్యత ఉంది. శక్తిమంతమైన మాధ్యమం సినిమా. మంచి కోసం ఉపయోగించండి. మంచి సినిమాలే తీయండి అని చెప్పుకొచ్చారు.

    English summary
    Jai Bolo Telangana is a Telugu-language film on the history of Telangana and its struggle for statehood. It was directed by N.Shankar and the lead character was played by Jagapathi Babu. The film has won the Andhra Pradesh state Nandi Award - Sarojini Devi Award for a Film on National Integration.Gaddar was adjudged the Best Singer for his rendition of Poru Telangana in the critically acclaimed film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X