గద్దర్ ప్రత్యేక పాత్రలో కనిపించే సినిమా
ఆ మధ్య ఎన్ శంకర్ రూపొందించిన జై బోలో తెలంగాణ చిత్రంలో కనపించి ఉత్తేజపరిచిన గద్దర్ మరోసారి వెండితెరపై దర్శనమివ్వనున్నాడు. తెలంగాణ రాష్ట్రసాధనకోసం, తెలంగాణ ప్రజానీకాన్ని ఉత్తేజితుల్ని చేయడం కోసం తన వంతు ప్రయత్నంగా రఫీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఇంకెన్నాళ్లు' చిత్రంలో ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 'కదం..కదం..' అనే తెలంగాణ ఉద్యమగీతాన్ని సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజిలో గద్దర్, వివిధ సంఘాలకు చెందిన విద్యార్థి నాయకులపై చిత్రీకరించారు రఫీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఈ పాటలో గద్దర్ ఇచ్చే ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. అటువంటి లెజెండ్‌తో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమాలోని పాటలు తెలంగాణ ప్రాంతంలో మారుమోగుతున్నాయి. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.


Click it and Unblock the Notifications











