సక్సెస్ కావాలంటే వందమందిని చితకబాదాల్సిందే...నాగార్జున
ఒక సినిమా సక్సెస్ చేయాల్సిన బాధ్యతను తీసుకున్నప్పుడు వంద మందికి పైగా వ్యక్తులను చితకబాదుతూ హీరోచిత యాక్షన్ చిత్రాల్లో నటించాలి. అవన్నీ చేయటం నాకు సర్వసాధారణం అంటున్నారు నాగార్జున. ఆయన తాజా చిత్రం గగనం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ... కానీ 'గగనం' దగ్గరకు వస్తే నేను స్క్రిప్ట్‌లో ఒక భాగం మాత్రమే. హిట్ చేసే బాధ్యత దర్శకుడు రాధామోహన్‌దే. అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను అని నాగార్జున చెప్పుకొచ్చారు. అలాగే దర్శకుడు రాధామోహన్ నాకు కథ చెప్పిన 10 సెకండ్ల తర్వాత 'గగనం'లో నటించటానికి ఒప్పుకున్నాను. ఆరు పాటలు, ఆరు ఫైట్ల అచ్చ తెలుగు మాస్ మసాలా ఫార్మూలాకు భిన్నంగా 'గగనం' తయారైంది. అయినా నాకు ఎలాంటి చింత లేదు అని ఆయన వెల్లడించారు.
అలాగే గగనంలో తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ...కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్ హైజాగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది అన్నారు. అలాగే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కాందహార్ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో విడుదలకానున్నది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కత్తి లో చేసిన సనాఖాన్ ప్రయాణికుల్లా చేస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: కె.కబీర్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











