గబ్బర్ సింగ్-2 దర్శకుడు కోన వెంకట్?
త్వరలో గబ్బర్ సింగ్-2కు ప్లాన్ చేస్తున్న పవన్ ఈచిత్రం ద్వారా....రచయిత కోన వెంకట్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. త్వరలో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది. హిందీలో హిట్టయిన 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్‌దే. దానికి 'గబ్బర్ సింగ్' అనే టైటిల్ పెట్టడం దగ్గర నుంచి హరీష్ శంకర్ దర్శకుడిగా ఎంపిక చేయడం వరకు అన్నీ పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకే జరిగాయి.
తాజాగా గబ్బర్ సింగ్-2 విషయంలో కూడా అదే జరుగబోతోందని, పవన్ నిర్ణయం మేరకు కోన వెంకట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. ఈచిత్రాన్ని పవన్ కళ్యాణ్ తన సొంత బేనర్ 'పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్'పై నిర్మించనున్నారని తెలుస్తోంది.
మరో వైపు కోన వెంకట్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఓ కథను తయారు చేసాడు. ప్రస్తుతం దానికి తుది మెరుగులు దిద్దుతున్న కోన త్వరలో దాన్ని ఆయనకు వినిపించే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం ట్విట్టర్లో కోన వెంకట్ ఈ విషయం గురించి చెబుతూ ''నేను నా యొక్క సోల్ మేట్ పవన్ కళ్యాణ్ కోసం కథ రాయడం మొదలు పెట్టాను. తర్వలోనే ఆయనకు దీన్ని వినిపిస్తా. అయితే దీన్ని శ్రీను వైట్ల అయితే పర్ ఫెక్టుగా తెరకెక్కిస్తాడని నా నమ్మం. ఈ కథ మొత్తం ఫన్ అండ్ యాక్షన్ తో కూడుకుని ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












