గజ తుఫాన్ బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించిన విక్రమ్
ప్రముఖ సౌత్ స్టార్ విక్రమ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. గజ తుఫాను బాధితుల కోసం రూ. 25 లక్షల సహాయం అదించారు. ఈ మేరకు ఆయన సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కోసం ఆన్ లైన్ ద్వారా విరాళం అందజేశారు.
ప్రస్తుతం తన తాజా చిత్రం 'కడరమ్ కొండమ్' సినిమా షూటింగులో భాగంగా మలేషియాలో ఉన్న ఆయన నేరుగా కలిసి ముఖ్యమంత్రికి చెక్ అందించే పరిస్థితిలో లేక పోవడంతో ఆన్ లైన్ ద్వారా విరాళం అందించి తనవంతు బాధ్యత నిర్వర్తించారు.
మరో వైపు గజ తుఫాను బాధితుల కోసం రజనీకాంత్ రూ. 50 లక్షల విరాళం అందించగా, సూర్య, కార్తి, జ్యోతిక, శివకుమార్ ఫ్యామిలీ తరుపున రూ. 50 లక్షలు, విజయ్ సేతుపతి రూ. 25 లక్షలు, విజయ్ రూ. 40 లక్షలు విరాళం అందించారు.

'కడరమ్ కొండమ్' చిత్రంతో పాటు గౌతమ్ మీనన్ పెండింగ్ మూవీ ధృవ నక్షత్రం అనే స్పై థ్రిల్లర్లో సైతం నటిస్తున్నారు. దీంతో పాటు త్వరలో ఆయన స్ట్రైట్ హిందీ మూవీ 'మహావీర్ కర్ణ' చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళం ఫిల్మ్ మేకర్ ఆర్ఎస్ విమల్ దర్శకత్వం వహించబోతున్నారు.
ఇక విక్రమ్ నటించిన గత చిత్రం 'సామీ స్కేర్' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. విక్రమ్ హిట్ మూవీ 'ఇరు ముగన్' చిత్రాన్ని నిక్మించిన శిబు తమీన్స్ కోసం సైతం ఓ సినిమా చేస్తానని విక్రమ్ కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











