సిద్ధార్థ్ సరసన 'గజరాజు' హీరోయిన్
సిద్ధార్థ్ హీరోగా 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఓ చిత్రం రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఇందులో సిద్ధార్థ్ సరసన నాయికగా లక్ష్మీమీనన్ నటిస్తుంది. తమిళంలో లక్ష్మీ మీనన్ కి మంచి క్రేజ్ ఉంది. దాంతో చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో లవ్ గురు గా హైలెట్ కానున్నారు. ఇందులో సిద్దార్ద పాత్ర పేరు కుమార్.
చిత్రం కథ గురించి దర్శకుడు సుందర్. సి. మాట్లాడుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేయాలన్నది కుమార్ ఉద్దేశం. చేసే పనిలో కష్టం ఉన్నా ఫలితం మధురంగా ఉంటుందని అతనికి చెప్పిందెవరు? అతని ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నించినవాళ్లకి ఎదురైన అనుభవాలేమిటన్నది తెర మీదే చూడాలన్నారు.


Click it and Unblock the Notifications












