మహేష్ బాబు మేనల్లుడి సినిమా షురూ, లుక్ చూసి కంగారు పడొద్దు... (ఫోటోస్)
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ విజయదశమి సందర్భంగా సినిమా ప్రారంభమైంది.
'అదే నువ్వు అదే నేను' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. శశి అనే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తున్నారు. గల్లా అశోక్.... ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అనే సంగతి తెలిసిందే.

లుక్ చూసి కంగారుపడొద్దు
కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే హీరోలు ఫస్ట్ సినిమా ప్రారంభోత్సవంలో స్మార్ట్‌గా కనిపిస్తుంటారు. కానీ గల్లా అశోక్ మాత్రం అందుకు భిన్నంగా బాగా పెరిగిన గెడ్డం, మీసంతో కనిపించాడు. అయితే లుక్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. సినిమా కథ ప్రకారం ఇలా పెరిగిన గడ్డం, మీసంతో ఫస్ట్ షెడ్య్యూల్ సీన్లు తీయాల్సి ఉంది. అందుకే సినిమా ప్రారంభోత్సవంలో కూడా అలానే కనిపిస్తున్నాడు.

అందుకు ఏ మాత్రం తగ్గకుండా
కృష్ణ, మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్తగా ఇండస్ట్రీకి హీరో వస్తున్నాడంటే అంచనాలు ఓ రేంజిలో ఉండటం సహజం. అందుకు ఏ మాత్రం తగ్గకుండా అశోక్ గల్లా తెరంగ్రేటం ఉంటుందని అంటున్నారు. ఇక్కడ ఫోటోల్లో సాధారణంగా కనిపించినా... రేపు సినిమాలో తన సత్తా చూపిస్తాడని అంటున్నారు.

నభా నటేష్ హీరోయిన్
సుధీర్‌బాబు మూవీ ‘నన్ను దోచుకుందువటే' ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నభా నటేష్ ఈ చిత్రంలో గల్లా అశోక్ సరసన నటిస్తోంది. ‘అదే నువ్వు అదే నేను' టైటిల్ చూస్తుంటే ఇదో ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది.

ప్రముఖ సమక్షంలో
‘అదే నువ్వు అదే నేను' సినిమా ప్రారంభోత్సవం నిన్నటితరం సూపర్ స్టార్ కృష్ణ, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు లాంటి ప్రముఖుల సమక్షంలో జరిగింది.


Click it and Unblock the Notifications











