అందుకే మహేష్ బాబుపై ఐటి దాడులు.. భయపడే ప్రసక్తే లేదు!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పని తాను చేసుకుపోయే వ్యక్తి. మహేష్‌కు అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులని అలాటించడానికి, వారి అంచనాలని చేరుకోవడానికి మహేష్ భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. మహేష్ బాబు తనంతట తానుగా ఎలాంటి వివాదాన్ని కొని తెచ్చుకోడు. కానీ కొన్ని సార్లు మహేష్ బాబు కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఆ మధ్య జరిగిన ఐటీ దాడులే ఇందుకు నిదర్శనం. మహేష్ బాబుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడానికి కారణం ఇదే అంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలనం విషయాన్ని ప్రకటించారు.

ఐటి రైడ్స్
కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు ఫ్యామిలీపై ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మహేష్ కు నోటీసులు కూడా జారీ చేశారు. 2007-08 సంవత్సరానికిగాను మహెష్ బాబు జీఎస్టీ సర్వీస్ టాక్స్ చెల్లించలేదని అధికారులు గత ఏడాది డిసెంబర్ లో నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు బ్యాంక్ అకౌంట్స్ ని కూడా అధికారులు నిలిపివేశారు. ఆ ఏడాది మహేష్ బాబు చెల్లించాల్సిన 18 లక్షల సర్వీస్ టాక్స్ ఇంకా చెల్లించలేదని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

మొత్తం 73 లక్షలు
వడ్డీ, పెనాల్టీ మొత్తం కలిపి మహేష్ చెల్లించాల్సిన బకాయిలు 73 లక్షలకు చేరాయని అందుకే బ్యాన్ ఖాతాలు నిలిపివేశామని అధికారులు అప్పట్లో తెలిపారు. మహేష్ బాబు పలు వాణిజ్య ప్రకటనల నుంచి ఆదాయం పొందుతూ సర్వీస్ టాక్స్ చెల్లించలేదని నోటీసులో పేర్కొన్నారు. మహేష్‌పై జరిగిన ఐటి దాడులలో రాజకీయ కోణం ఉందంటూ ఆ సమయంలో వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్ బావ, గుంటూరు ఎంపీ అయిన గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా వల్లే దాడులు
ఎన్నికల ప్రచారంలో గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. తాను 'మిస్టర్ మోడీ' అని ప్రధానిని పార్లమెంట్‌లో నిలదీయడం వల్లే మహేష్ బాబుపై ఐటి దాడులు జరిగినట్లు గల్లా జయదేవ్ ఆరోపించారు. నేను మోడీకి భయపడలేదు. అందుకే ఐటి దాడులు జరిపి తన కుటుంబాన్ని, మహేష్‌ని భయపెట్టాలని చూశారు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా తాను, తన కుటుంబం భయపడం అని గల్లా జయదేవ్ అన్నారు.

మహర్షి చిత్రంతో
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు మహర్షి చిత్రంతో బిజీగా ఉన్నాడు. మహర్షి చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహర్షి చిత్రం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలోని చిత్రం ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications











