మహేష్ బాబు ఫ్యామిలీనుంచి మరో హీరో: టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న గల్లా అశోక్

కృష్ణ కుమార్తె పద్మావతి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ల కుమారుడు గల్లా అశోక్. వచ్చే ఏడాది ఈ హీరోగారు వెండితెర ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతున్నాడట.

Recommended Video

మహేష్ బాబు ఫ్యామిలీనుంచి మరో హీరో..!

తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికైనా సరే సూపర్ స్టార్ అంటే కృష్ణనే. మూడు దశాబ్దాల పాటు ఆయన వెండితెరపై మెరిశారు. ఆయన తర్వాత ఆయన నటవారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు ఎంటరయ్యాడు. ఈ తర్వాత అదే కుటుంబం నుంచి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో అందాల నటుడు ఆ ఇంటి నుంచి సినీ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. అతను మరెవరో కాదు...

 కథలు కూడా వింటున్నాడట

కథలు కూడా వింటున్నాడట

కృష్ణ కుమార్తె పద్మావతి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ల కుమారుడు గల్లా అశోక్. వచ్చే ఏడాది ఈ హీరోగారు వెండితెర ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతున్నాడట. ఈ నేపథ్యంలో తండ్రి గల్లా జయదేవ్.. పలువురి దర్శకుల నుంచి కథలు కూడా వింటున్నాడట.

 మహేశ్ సొంత బ్యానర్‌లో

మహేశ్ సొంత బ్యానర్‌లో

అయితే ఈ సినిమాను మహేశ్ సొంత బ్యానర్‌లో ఉంటుందా లేక గల్లా జయదేవ్ బ్యానర్‌లో ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. గల్లా అశోక్ కోసం.. గల్లా యువ సైన్యం పేరుతో ఒక అభిమాన సంఘం కూడా వెలిసింది. ఇంకా సినిమా విడుదల కావడం పక్కనపెడితే.. కనీసం సినిమానే ఫైనల్ కాలేదు.. ఇంతలోనే అభిమాన సంఘమా అని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

 మరొక హీరో రంగప్రవేశం

మరొక హీరో రంగప్రవేశం

తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరొక హీరో రంగప్రవేశం చేయబోతున్నాడు. మహేష్ బావ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ తన మామయ్యలాగా సినిమా రంగంలో రాణించాలని ఆశ పడుతున్నాడు. దాంతో హీరో అయ్యేందుకు అవసరమైన అంశాల్లో అశోక్ కు చాలా రోజుల ముందే ట్రైనింగ్ మొదలెట్టేశారని తెలుస్తోంది.

 హీరోగా లాంచ్ చేసే పనులు

హీరోగా లాంచ్ చేసే పనులు

ప్రస్తుతం ఈ ట్రైనింగ్ అంతా ఓ కొలిక్కి రావడంతో అతడిని హీరోగా లాంచ్ చేసే పనులు మొదలెట్టారు. పెద్ద ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకు అశోక్ ను లాంచ్ చేసే బాధ్యతలు అప్పగించబోతున్నారు. అశోక్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలన్నది ఇంకా డిసైడ్ అవలేదు.

మహేష్ సోదరి మంజుల

మహేష్ సోదరి మంజుల

కొత్త డైరెక్టర్ తో సినిమా త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందట. మహేష్ సోదరి మంజుల హీరోయిన్ గా రాణించాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనక్కు తగ్గింది.

మంజుల కుమార్తె జాన్వి

మంజుల కుమార్తె జాన్వి

ఆమె కుమార్తె జాన్విని హీరోయిన్ చేయాలని అనుకుంటోంది. ఆమె హీరోయిన్ కావడానికి ఇంకా కొంతకాలం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి మంజుల డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమాలో ఆమెతో ఓ స్పెషల్ రోల్ చేయించారు. మొత్తంమీద ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి భవిష్యత్తులో ఓ హీరో.. ఓ హీరోయిన్ ను చూడొచ్చన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X