GAMA Awards: పవన్‌కే బెస్ట్ మూవీ అవార్డ్.. ఉత్తమ హీరోగా చిన్న రౌడీ.. 2021 - 2023 విజేతలు వీళ్లే
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లకు గతంలో నంది అవార్డులను మాత్రమే అందించేవారు. కానీ, ఇప్పుడు చాలా రకాల పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. అలాంటి వాటిలో 'గామా అవార్డులు' ఒకటి. ఈ అవార్డుల కార్యక్రమం నాలుగేళ్ల క్రితమే ప్రారంభం అయింది. తాజాగా జరిగిన నాలుగో ఎడిషన్‌లో 2021, 2021, 2023 సంవత్సరాలకు గానూ అవార్డులను అందించారు. మరి ఈ మూడేళ్లలో ఎవరికి ఈ అవార్డులు దక్కాయో మీరే చూసేయండి మరి!
ఎంతో గ్రాండ్‌గా జరిగిన వేడుక:'గామా అవార్డులు' 4వ ఎడిషన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే మార్చి 6వ తేదీన దుబాయ్‌లో దీన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మొత్తం మూడేళ్లకు గానూ 40కి పైగా విభాగాల్లో అవార్డులను అందజేశారు. దీంతో ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది.

అవార్డుల్లో హైలైట్స్ అవే:తాజాగా ప్రకటించిన గామా అవార్డుల్లో ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రంగా RRR నిలిచింది. అలాగే, బెస్ట్ హీరోలుగా అల్లు అర్జున్, నిఖిల్ సిద్దార్థ్, ఆనంద్ దేవరకొండలు ఎంపిక అయ్యారు. అలాగే, ట్రెండింగ్ యాక్టర్‌గా తేజ సజ్జాకు అవార్డు దక్కింది. వీళ్లతో పాటు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా ప్రకటించారు. 2023వ ఏడాదికి గానూ పవన్ సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ మూడు సంవత్సరాల పూర్తి జాబితాను మీరే చూసేయండి.

2021 విజేతలు వీళ్లే:
బెస్ట్ యాక్టర్ - అల్లు అర్జున్ (పుష్ప)
బెస్ట్ హీరోయిన్ - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)
బెస్ట్ డైరెక్టర్ - సుకుమార్ (పుష్ప)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - అషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)
మూవీ ఆఫ్ ద ఇయర్ - పుష్ప
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - దేవిశ్రీప్రసాద్ (పుష్ప)
మోస్ట్ పాపులర్ సాంగ్ - నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)
బెస్ట్ పాపులర్ సాంగ్ - మౌనిక యాదవ్ (సామి నా సామి - పుష్ప)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ - ధనుంజయ్ (నా మది నీదదై)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ - ఎం ఎల్ శృతి (అడిగా అడిగా)

2022 విజేతలు వీళ్లే:
బెస్ట్ యాక్టర్ - నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)
బెస్ట్ హీరోయిన్ - మృణల్ ఠాకూర్ (సీతారామం)
బెస్ట్ డైరెక్టర్ - హను రాఘవపూడి (సీతారామం)
జ్యూరీ బెస్ట్ యాక్టర్ - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - దక్ష నగర్ (జాంబిరెడ్డి)
మూవీ ఆఫ్ ద ఇయర్ - సీతారామం
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - ఎస్ ఎస్ తమన్ (భీమ్లా నాయక్)
బెస్ట్ ఆల్బమ్ - సీతారామం (విశాల్ చంద్రశేఖర్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ - హారిక నారాయణ (లాహే లాహే ఆచార్య)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ - అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల- శ్యాం సింగరాయ్)
2023 విజేతలు వీళ్లే:
బెస్ట్ యాక్టర్ - ఆనంద్ దేవరకొండ (బేబీ)
బెస్ట్ హీరోయిన్ - సంయుక్త మీనన్ (విరూపాక్ష)
బెస్ట్ డైరెక్టర్ - బాబీ కొల్లి (వాల్తేరు వీరయ్య)
జ్యూరీ బెస్ట్ యాక్టర్ - సందీప్ కిషన్ (మైకేల్)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - డింపుల్ హయతి (ఖిలాడి)
మూవీ ఆఫ్ ది ఇయర్ - బ్రో
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - హేషం అబ్దుల్ వహాబ్ (ఖుషి)
మోస్ట్ పాపులర్ సాంగ్ - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)
బెస్ట్ లిరిసిస్ట్ - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి - దసరా)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ - చిన్మయి (ఆరాధ్య - ఖుషి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ - రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా)

ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు:
మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ ఆర్ ఆర్
బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హనుమాన్)
బెస్ట్ వర్సటైల్ యాక్టర్ - మురళీ శర్మ
మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నెక్లెస్ గొలుసు (రఘు కుంచె)
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ - డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎం ఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
గౌరవ్ సత్కర్ - చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)
జ్యూరీ మెంబర్ - వీ ఎన్ ఆదిత్య (గామా జ్యూరీ)
మెమోరియల్ అవార్డు - ఫోక్ సింగర్ నల్లగొండ గద్దర్ నరసన్న


Click it and Unblock the Notifications











