twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "గేమ్ ఆఫ్ అయోధ్య" రిలీజ్ చేస్తున్నారట: దేశాన్ని కుదిపేసిన సంఘటనతో, బాబ్రీ విధ్వంసం కూడా...

    బాబ్రీ మసీదు విధ్వంసం ఆధారంగా రూపొందిన ‘గేమ్ ఆఫ్ అయోధ్య' చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.

    |

    Recommended Video

    "గేమ్ ఆఫ్ అయోధ్య" రిలీజ్ చేస్తున్నారట !

    బాబ్రీ మసీదు విధ్వంసం ఆధారంగా రూపొందిన 'గేమ్ ఆఫ్ అయోధ్య' చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నట్టు దర్శకుడు సునీల్ సింగ్ తెలిపారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఓ ప్రేమ కథ ద్వారా చెప్పేందుకు ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు.

     సెన్సార్ బోర్డు నిరాకరించింది

    సెన్సార్ బోర్డు నిరాకరించింది

    ఎవరికీ తెలియని, బయటకు రాని పలు విషయాలను ఈ సినిమా ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు తొలుత సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమా భయటకు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న అనుమానంతో ఈ సినిమాని ఆపేసారు.

     రెచ్చగొట్టే అవకాశం ఉందని

    రెచ్చగొట్టే అవకాశం ఉందని

    సున్నితమైన అయోధ్య నేపథ్యంలో సినిమా తెరకెక్కడం.. ఇప్పటికీ వివాదం కొనసాగుతుండటంతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సీబీఎఫ్‌సీ నిరాకరించింది. మత విద్వేషాలను ఈ సినిమా రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెప్పింది. కానీ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరెకెక్కించడంతో ఫిల్మ్ ట్రైబ్యునల్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

     ప్రేమ కథ ఉంటుంది..

    ప్రేమ కథ ఉంటుంది..

    ఈ సినిమాకు సంబంధించిన వివరాలను డైరెక్టర్ సునీల్ సింగ్ మీడియాకు వివరించాడు. అయోధ్య కూల్చివేతకు సంబంధించి అసలు కథను ఈ సినిమాలో అభిమానుల ముందుకు తెస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇందులో ప్రేమ కథ ఉంటుంది..

    సెన్సార్ బోర్డు బ్యాన్

    సెన్సార్ బోర్డు బ్యాన్

    ఒక పాత్రికేయుడు ప్రేమ జంటకు ఎలా సహాయం చేశాడన్న దానిపై సినిమా మొత్తం ఉంటుందని స్పష్టం చేశారు. చాలా మందికి తెలియని నిజాలన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నామని డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమా విడుదల చేయడానికి వీల్లేదని సెన్సార్ బోర్డు బ్యాన్ చేయడం జరిగింది..

     U/A సర్టిఫికెట్

    U/A సర్టిఫికెట్

    అయితే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ)కు ఫిర్యాదు చేయగా ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా విడుదలచేయడానికి మార్గం సుగుమమైందని సునీల్ సింగ్ తెలిపారు. మొత్తానికి ఫైనల్‌గా ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చిందని డైరెక్టర్ స్పష్టం చేశారు.

    చాలానే కష్టపడ్డారు

    చాలానే కష్టపడ్డారు

    మక్రాండ్ దేశ్పాండే నటించిన ఈ సినిమా చాలా వినోదభరితమైనది మరియు 1992 లో ఓ దురదృష్టకరమైన రోజు ఎంతో మంది జీవితాలను ఎలా మార్చుకున్నాడో కూడా అవగాహన చేస్తుందని ఆయన తెలిపాడు. మొత్తానికి ఈ సినిమాని బయటికి తేవటానికి చాలానే కష్టపడ్డారు...

    English summary
    Director Sunil Singh is happy that his film "Game of Ayodhya", based on the Babri Masjid demolition, will release on November 24.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X