"గేమ్ ఛేంజర్"లో జనసేన టాపిక్ .. దిల్ రాజు హాట్ కామెంట్స్ వైరల్
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయ్యిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది. ఇక తెలుగులో ఈ సినిమా తర్వాత వస్తున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం "గేమ్ ఛేంజర్" అని చెప్పాలి.
రామ్ చరణ్ అలాగే సెన్సేషనల్ దర్శకుడు శంకర్ ల కలయికలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి . కానీ ప్రస్తుతానికి అది తెలుగు రాష్ట్రాల వరకే ఉన్నాయని చెప్పాలి. తెలుగు నాట మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో తమ బిగ్ స్టార్స్‌కి ఆదరణ అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరీ ముఖ్యంగా మెగా ఇంటి నుంచి ఓ బిగ్ సినిమా వస్తుంది అంటే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా కూడా కష్టం. అయితే ఇపుడు దిల్ రాజు చేసిన రీసెంట్ హాట్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇటీవల యూఎస్ లో గ్రాండ్ గా జరిగిన భారీ ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ లో కొన్ని సీన్స్ కోసం తాను మాట్లాడ్డం జరిగింది. ఇపుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏం జరిగాయి అనేది శంకర్ గారు గత నాలుగేళ్ళ కితమే రాసుకున్నారని బాంబు పేల్చారు.
అలాగే చరణ్ బాబాయ్ టాలీవుడ్ పవర్ స్టార్ అంతకుమించి ఇపుడు ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రిలేటెడ్ గా చాలా సన్నివేశాలు గేమ్ ఛేంజర్ లో ఉంటాయని దిల్‌రాజు తెలిపారు. వాటిని ఎంజాయ్ చెయ్యడానికి అంతా సిద్ధంగా ఉండాలని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ వేరేగా వెళ్తాయేమోనని భయపడ్డ దిల్‌రాజు వెంటనే శంకర్ గారు ఆ సీన్స్ అన్నీ ఎప్పుడో నాలుగేళ్ల కితమే రాసుకున్నారని చెప్పారు.
సరిగ్గా అలానే చాలా సీన్స్ తెలుగు స్టేట్స్ రాజకీయాలకి సంబంధించి కనెక్ట్ అయ్యేలా ఉంటాయని దిల్ రాజు చెప్పడం ఇపుడు రెండు రాష్ట్రాల్లో చర్చకి దారి తీసింది. దీనితో మెగా అభిమానులకి మాత్రం గేమ్ ఛేంజర్ అనుకున్నదానికంటే ఎక్కువే ఎక్కేలా ఉందని చెప్పవచ్చు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి అంటే ఈ జనవరి 10 వరకు ఆగాల్సిందే మరి. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అంజలి, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











