గేమ్ ఛేంజర్ పైరసీపై పంజా.. ఏపీ లోకల్ టీవీ సిబ్బంది అరెస్ట్!

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలైన రోజు తొలి ఆట తర్వాత ఈ సినిమా పైరసీ బారిన పడింది. ఈ సినిమా హెచ్ డీ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీకైంది. దాంతో చిత్ర యూనిట్ పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇందుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులు కొనసాగించింది. తాజాగా ఏపీలో నిబంధనలకు విరుద్దంగా సినిమాను కేబుల్ టీవీలో ప్రసారం చేసిన వారిని అదుపులోకి తీసుకొన్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజైన ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. నెటిజన్లు, పైరసీ దారులు సినిమా క్లిప్పింగులను, పూర్తిస్థాయి నిడివి ఉన్న మూవీని లీక్ చేశారు. అంతేకాకుండా కేబుల్ టీవీ, ప్రైవేట్ బస్సుల్లో సినిమాను ప్రదర్శించారు. పైరసీ యాక్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించిన వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Game Changer Piracy In Andhra Pradesh AP Local TV Staff Arrested

గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్‌లో ఇంకా ప్రదర్శిస్తుండగా ఈ సినిమాను ఆన్‌లైన్‌ కొందరు లీక్ చేశారు. ఈ వ్యవహారంలో సుమారుగా 45 మందిని గుర్తించారు. వారిపై సైబర్ క్రైమ్ విభాగంలో కేసులు నమోదు చేశారు. వారిపై పోలీసుల చర్యలకు ఉపక్రమించారు. ఇదిలా ఉండగానే.. ఏపీలో దారుణంగా కేబుల్ టీవీలో సినిమాను ప్రదర్శించిన విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఏపీలో చట్ట విరుద్దంగా సినిమాను ప్రదర్శిస్తున్న వారిపై విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని గాజువాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాపీరైట్ సెఫ్టీ సిస్టమ్ ఎండీ హెచ్‌వీ చలపతిరాజు అధ్వర్యంలో మెరుపుదాడులు నిర్వహించారు. ఇందుకు బాధ్యులనైన ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి అప్పలరాజును అరెస్ట్ చేశారు.

Game Changer Piracy In Andhra Pradesh AP Local TV Staff Arrested

కాపీరైట్ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా గేమ్ ఛేంజర్ సినిమాను ప్రదర్శించిన చలపతిరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి సంస్థ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను సీజన్ చేశారు. ఈ సినిమాను ప్రదర్శించిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

More from Filmibeat

Read more about: game changer ram charan dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X