‘రాంగోపాల్ వర్మకు నేను పెళ్లాన్ని.. అక్రమ సంబంధంతో మాకు బిడ్డ పుట్టింది’
కోట్ట రూపాయలు పెడితే కానీ సినిమా నిర్మించలేని ఈ రోజుల్లో.. ప్రస్తుతం యువ దర్శకుడు వారణాసి సూర్య.. డబ్బు లేకుండానే సినిమాను పూర్తి చేశాడు. రాంగోపాల్ వర్మ ఇచ్చిన జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌తో గండ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు రాంగోపాల్ వర్మను ఆహ్వానిస్తే ముఖం చాటేయడంతో యువ దర్శకుడు సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకారం కోరితే స్పందించడం లేదని ఘాటుగా స్పందించాడు. బుధవారం (28 జూన్) ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారణాసి సూర్య మాట్లాడుతూ..
నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా మొగుడు రాంగోపాల్ వర్మ. ఆయనకు నాకు అక్రమ సంబంధం ఏమిటంటే.. 10 సంవత్సరాల క్రితం తను జీరో బడ్జెట్ సినిమా అనే కాన్సెప్ట్ చెప్పారు. ఆయన ఆర్టిస్టుల బాగు గురించి చెప్పాడా? లేదా ఇండస్ట్రీ బాగుపడుతుందని ఆయన జీరో బడ్జెట్ కాన్సెప్ట్ చెప్పాడా? అనేది నాకు తెలియదు. కానీ ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అని వారణాసి సూర్య అన్నారు.
నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతానని రాంగోపాల్ వర్మ ఎప్పుడు చెబుతుంటాడు. మీడియాను వాడుకొని ఆయన బతికేస్తుంటాడు. అయితే తాను ఇప్పుడు ఆర్జీవిని వాడుకొని ఇండస్ట్రీలో బతకబోతున్నాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆర్జీవిని విచ్చలవిడిగా వాడుకోబోతున్నాను. ఆర్జీవి నా మొగుడు, ఫిలాసఫర్ అనే విషయాన్ని నేను స్పష్టంగా వీలు చిక్కినప్పడల్లా చెబుతున్నాను అని వారణాసి సూర్య తెలిపారు.
ఆర్జీవి జీరో బడ్జెట్‌తో సినిమా చేయవచ్చనే ఐడియా నుంచి నేను పుట్టుకొచ్చాను. ఆ సమయంలో ఆయన ఐడియా ఇచ్చి ఉండకపోతే నేను మా ఊర్లో షాపు పెట్టుకొని బతికే వాడిని. ఎందుకంటే డబ్బు లేకపోతే సినిమా చేయడం కష్టం. ఆయన ఇచ్చిన ఐడియాతో ఈజీ సినిమా బ్యానర్ పెట్టే వరకు వచ్చింది అని నటుడు, దర్శకుడు వారణాసి సూర్య అన్నారు.

రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఐడియాతోనే నేను గండ సినిమా చేశాను. ఆయనకు బంధాలు, అనుబంధాలు ఉండవు. కాబట్టి నేను ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకొన్నాను. ఒక పెళ్లాం మాదిరిగా ఆయనతో గండ అనే మొదటి బిడ్డను కన్నాను. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అని వారణాసి సూర్య చెప్పారు. నేను ఆయనకు ఎన్నోసార్లు విన్నవించుకొన్నాను. బయటకు వచ్చి ఈ కాన్సెప్ట్‌కు ప్రమోట్ చేయమని అని అన్నారు.
ఆర్జీవి నీవు ఇచ్చిన ఐడియాతోనే గండ సినిమా చేశాను. మీరు బయటకు వచ్చి కొంచెం సపోర్ట్ చేయమని చాలాసార్లు మెసేజ్ కాల్స్ చేశాను. కానీ ఒక్కసారి మాత్రమే కాల్ లిఫ్టు చేశాడు. అయితే నేను ఏమీ చేయాలని అడిగాడు. అయితే వర్మ ఇచ్చిన ఐడియాతో నాకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవడు? కాబట్టి ఆర్జీవి నన్ను ఉంచుకో. నీకు అక్రమ సంబంధంతో పెళ్లాం ఉందని గుర్తుంచుకో అని వారణాసి సూర్య తెలిపారు.


Click it and Unblock the Notifications











