మున్ని గురించి...గబ్బర్ సింగ్ నిర్మాత
గబ్బర్ సింగ్ చిత్రంలో మలైకా అరోరాని ఐటం గర్ల్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాలీవుడ్‌లో ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ 'దబాంగ్'లో మలైకా అరోరా చేసిన 'మున్ని బద్నామ్ హుయి' అనే ఐటం సాంగ్ కు వరల్డ్ వైడ్‌గా వచ్చిన రెస్సాన్స్ అంతా ఇంతా కాదు. 'గబ్బర్ సింగ్'లో కూడా ఈ ఐటంను మలైకా అరోరాతోనే చేయిస్తున్నాం. తప్పకుండా ఈ సాంగ్ పెద్ద హిట్టవుతుందన్న కాన్ఫిడెన్స్ మాకు ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే నెంబవర్ వన్ హిట్‌గా నిలబడ్డమే కాదు కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది 'గబ్బర్ సింగ్'. ఈ సినిమా తీసే అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కి థ్యాంక్స్. మా దర్శకుడు హరీష్ శంకర్ ఎక్స్ ట్రార్డినరీగా తీస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్. ఏప్రిల్ మొదటి వారంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆడియో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. మే 9న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం...అని చెప్పారు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీ భట్ల తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











