‘గబ్బర్‌సింగ్’ఆడియో గురించి నిర్మాత
పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్‌సింగ్'. శృతిహాసన్ హీరోయిన్ గా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఆఅడియో గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ..ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోందని, రికార్డులు సృష్టించే చిత్రంగా వుందని అందరూ చెప్పడం సంతోషంగా వుందని తెలిపారు. సంగీతమే హైలెట్‌గా రూపొందిన పాటలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తున్నామని, మే 9న వేసవి సెలవులకు విడుదలయ్యే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు.
హరీష్ శంకర్ ఎస్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. కోట శ్రీనివాసరావు, అభిమన్యుసింగ్, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, నిర్మాత: బండ్ల గణేష్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











