బండ్ల గణేష్‌పై చెక్ బౌన్స్ కేసు.. మరోసారి కోర్టుకు హాజరు
Recommended Video
బండ్ల గణేష్‌ని టాలీవుడ్ సంచలన స్టార్‌గా చెప్పుకోవచ్చు. కమెడియన్ గా కొన్నాళ్ల పాటు అలరించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు రూపొందించాడు. బిజినెస్ పట్ల ఎక్కువగా మక్కువ చూపే బండ్ల గణేష్ పై ఇటీవలే చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే పలుసార్లు కోర్టు మెట్లెక్కిన ఆయన తాజాగా మరోసారి కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టులో హాజరయ్యాడు. వివరాల్లోకి పోతే..

బడా వ్యాపారవేత్త.. బండ్ల గణేష్
కేవలం సినిమాల్లోనే కాకుండా వ్యాపార కార్యకలాపాల్లో కూడా చురుకుగా ఉండే బండ్ల గణేష్‌కి బాగా పౌల్ట్రీ ఫామ్ ఉంది. మొదట పౌల్ట్రీ రంగంలో రాణించాకే సినిమా రంగంలో అడుగు పెట్టాడు బండ్ల గణేష్. అయితే తన వ్యాపార లావాదేవీల్లో భాగంగా కడప జిల్లాలో కొంతమంది దగ్గర అప్పు చేశారు బండ్లగణేష్.

సుమారు 60 మందికి బాకీ.. చెక్ బౌన్స్
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో గల సుమారు 60 మంది వద్ద బండ్ల గణేష్ అప్పు తీసుకున్నట్లు సమాచారం. వాళ్ల నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకున్న బండ్ల గణేష్ ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు గాను వారికి చెక్కులు ఇచ్చారట. అయితే తీరా డబ్బు తీసుకుందామని బ్యాంకుకు వేలేసరికి.. ఆ చెక్కులు బౌన్స్ కావడంతో వారంతా కలిసి బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు.

చాలా కాలంగా వాయిదా
నిజానికి గతంలో ఎప్పుడో నమోదైన ఈ కేసు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వాయిదా రావడంతో ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యాడు బండ్ల గణేష్. అయితే కేసు పరిశిలించిన ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ మరోసారి ఈ కేసును ఆగస్టు 7కు వాయిదా వేయడం జరిగింది.

రాజకీయ నాయకుడిగా కూడా
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగా కూడా అవతారం ఎత్తిన బండ్ల గణేష్.. కాంగ్రెస్ ఓడిపోతే నాలుక కోసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తో ఆయన సినిమా నిర్మించనున్నారనే టాక్ కూడా వినిపించింది.


Click it and Unblock the Notifications











