కొరటాల శివతో సినిమా ఖరారు చేసిన గణేష్ బాబు
'మిర్చి' విడుదలైన సాయంత్రానికే శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత బండ్ల గణేశ్ ప్రకటించేశారు. ఆ చిత్రానికి హీరో ఎవరు? అనే విషయమై ఫిలింనగర్‌లో రకరకాల పేర్లు వినిపించాయి. కొందరు ఎన్టీఆర్ అంటే, ఇంకొందరు రామ్‌చరణ్ అన్నారు. పవన్‌కల్యాణ్ పేరు కూడా కొంతవరకు వినిపించింది. అయితే... విశ్వసనీయ సమాచారం ఏంటంటే... కొరటాల శివ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న చిత్రానికి హీరో 'రామ్‌చరణ్'.
ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని మే 15న ఘనంగా నిర్వహించడానికి బండ్ల గణేశ్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఎన్టీఆర్‌తో కూడా కొరటాల శివ ఓ చిత్రం చేయబోతున్నారు. ఆ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారని తెలుస్తోంది. ఇలా ఉన్న ఫళంగా ఇద్దరు స్టార్‌హీరోలను డెరైక్ట్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేసి కొరటాల శివ. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.
పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'గబ్బర్‌సింగ్' వంటి హిట్ ఇచ్చిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేష్ ప్రస్తుతం ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 'బాద్‌షా', అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్‌తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌లో ఓ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications












