దబాంగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కీ గణేష్ కీ మధ్య...
బాలీవుడ్ లో 2010 లో విడుదలై సంచలన రీతిలో కలెక్షన్స్ కురిపించిన "దబాంగ్" చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కై చాలా రోజులుగా పోటీ నెలకొని ఉంది. అయితే ఆ రైట్స్ ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ అధినేత గణేష్ బాబు తీసుకున్నారు. ఆయన ఈ విషయమై నిన్న(శనివారం) పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఈ లోగా పవన్ కళ్యాణ్ తను ఆ చిత్రం స్వయంగా తన బ్యానర్ పై రీమేక్ చేస్తున్నానని, దర్శకుడు హరీష్ శంకర్ అని శనివారం సాయింత్రం ప్రకటించారు.
ఇక గణేష్ మరో ప్రక్క న్యూస్ పేపర్ లో తాము ఆ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నాము కాబట్టి ఎవరైనా ఆ చిత్రంలోని సన్నివేశాలు కానీ, కథను కానీ కాపీ కొడితే చట్టబద్దంగా చర్యలుతీసుకోవటం జరుగుతందని హెచ్చరించారు. ప్రస్తుతం గణేష్ బాబు..పవన్ కళ్యాణ్ హీరోగా లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ లవ్ లీ ని చేస్తున్నారు. ఈచిత్రంలో పవన్ సరసన త్రిష హీరోయిన్ గా చేస్తోంది. ఇక గణేష్ బాబు ఈ మధ్యన సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భాను కిరణ్ తో సంభంధాలు ఉన్నాయంటూ మీడియాకెక్కారు. ఇంతకీ గణేష్ కీ పవన్ కళ్యాణ్ కీ ఈ చిత్రం విషయమై ఏదన్నా ఎగ్రిమెంట్ జరిగి ఉండవచ్చునని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











