పవన్ కళ్యాణ్ నిఅడ్డం పెట్టుకుని అంతా గణేష్ బాబే..

By Srikanya

పవన్ కళ్యాణ్ రీసెంట్ గా గబ్బర్ సింగ్ టైటిల్ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ 'దబాంగ్" కి రీమేక్. ఈ చిత్రం గురుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తోలి చిత్రం ఇది. హిందీ సూపర్ హిట్ దబాంగ్ ఆధారంగా చేస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ గా నటిస్తున్నాను అన్నారు. అయితే అది నిజం కాదని గణేష్ బాబే నిర్మాత అని అంతటా వినపడుతోంది. గణేష్ కి ఈ మధ్యన పరిటాల సూరి హత్య కేసులో నిందితుడు భానుతో రిలేషన్స్ ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేఫధ్యంలో గణేష్ కి బాగా సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ ఈ విధంగా తన పేరు ఉపయోగించి సహాయం చేస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం గణేష్ నిర్మాతగా చేస్తున్న లవ్ ఆజ్ కల్ రీమేక్ తర్వాత ఈ చిత్రం ఉండబోతోంది. పేరుకు పవన్ కళ్యాణ్ క్రియోటివ్ వర్క్స్ బ్యానర్ అనే గానీ మొత్తం వెనక ఉండి డబ్బు పెట్టుబడి పెట్టి నడిపించేది గణేష్ బాబే అంటున్నారు. అందులోనూ దబాంగ్ రీమేక్ రైట్స్ తీసుకున్నది కూడా గణేష్ బాబే కావటం ఈ వార్తలకు ఊతమిస్తోంది. తాను దబాంగ్ తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నానని, ఎవరూ కాపీ కొట్టవద్దని ఈ మధ్యనే గణేష్ ఓ లీడింగ్ పేపరులో లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేయబోతున్నాడు. హరీష్..రవితేజతో మిరపకాయ అనే హిట్ కొట్టారు. ఈ మిరపకాయ కథని కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పాడు కానీ ఓకే కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X