పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ నిర్మాత మారారంటూ అఫీషియల్ ప్రకటన
బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్‌సింగ్"చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మొదట పవన్ కల్యాణ్ స్వయంగా నిర్మిచాలని ప్లాన్ చేసారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు గణేష్ బాబుని సీన్ లోకి తెచ్చారు. ఈ విషయమై అపీషియల్ గా ప్రకటించారు. ఈ విషయమై గణేష్‌బాబు మాట్లాడుతూ '' నా మీద అభిమానంతో వెంటనే మా బేనర్‌లో రెండో సినిమాకి డేట్స్ ఇచ్చిన పవన్‌కళ్యాణ్ గారికి రుణపడి వుంటాను. పవర్‌స్టార్‌తో వెంటనే రెండవ సినిమా తీసే అవకాశం దక్కినందుకు సంతోషంగా వుంది. హిందీలో సెన్సేషనల్ హిట్ అయిన 'దబాంగ్" ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నాం. పవన్‌కళ్యాణ్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే అంశాలతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతుంది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభించే ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఓ ప్రముఖ హీరోయిన్ కథానాయికగా ఉంటారు. 'మిరపకాయ్" వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్‌శంకర్ 'గబ్బర్‌సింగ్" చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు"" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్‌శంకర్. పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్" వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన గణేష్‌బాబు ఈ 'గబ్బర్‌సింగ్" చిత్రాన్ని నిర్మించటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











