పవన్ 'తీన్ మార్' లో మహా శివుడు పై స్పెషల్ గా

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ లో ఫ్యాన్స్ ఆనందంతో డాన్స్ చేసే స్ధాయిలో మహా శివుడు పై ఓ పాటను చిత్రీకరించాం అంటున్నారు నిర్మాత గణేష్ బాబు. ఈ విషయం ఆయన ప్రస్దావిస్తూ...మహాశివరాత్రి పర్వదినాన తీన్‌మార్ గురించి తెలపడం ఆనందంగా ఉంది. కాశీలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మహాశివుడిపై అద్భుతమైన పాటను చిత్రీకరించాం.మహాశివుడ్ని కీర్తిస్తూ... వారణాసిలో పవన్‌కళ్యాణ్ నర్తిస్తుంటే... అభిమానులు థియేటర్‌లో తీన్‌మార్ ఆడటం ఖాయం అన్నారు గణేష్‌బాబు.జయ బోలో శివ శంకర్ అంటూ ఈ పాట సాగుతుంది.

అలాగే పవన్‌ కళ్యాణ్ నటన, త్రిష గ్లామర్, త్రివిక్రమ్ మాటలు, మణిశర్మ సంగీతం, జయంత్ టేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ చిత్రాన్ని రికార్డు హిట్‌గా నిలబెట్టడం ఖాయం. మార్చి రెండవవారంలో పాటలను, ఏప్రిల్ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తాం అన్నారు. ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్: బడే రవికిరణ్, సమర్పణ: శివబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X