మెగాభిమానుల నుంచి తీవ్రపరిణామాలు..హెచ్చరిక
అలాంటి ప్రయత్నం చేస్తే మెగాభిమానుల నుంచి తీవ్రపరిణామాలు ఎదుర్కొవలసి వస్తుంది' అని హెచ్చరించారు తీన్ మార్ నిర్మాత గణేష్ బాబు.ఇంతకీ ఏమిటా ప్రయత్నాలు అంటే ఈ చిత్రం పైరసీ చేయటం అని అన్నారు.పవన్‌కళ్యాణ్ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై తాను నిర్మించిన 'తీన్‌మార్' చిత్రం తొలి రోజునే 9 కోట్ల 48 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాత గణేష్‌బాబు చెప్పారు. ఆయన మాట్లాడుతూ 'పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది పెద్ద హి ట్. ఆయన అభిమానులు చిత్రాన్ని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. నైజాం ఏరియాలో కోటి డెబ్బయి లక్షల రూపాయల షేర్‌ని మా సినిమా సాధించింది. పరిశ్రమలోని అన్ని రికార్డులను ఈ చిత్రం తిరగరాస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తీసినందుకు నా జన్మ ధన్యమైంది. నాకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాను పైరసీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.అలాంటి ప్రయత్నం చేస్తే మెగాభిమానుల నుంచి తీవ్రపరిణామాలు ఎదుర్కొవలసి వస్తుంది అన్నారు.


Click it and Unblock the Notifications











