క్యూట్ వీడియో: కూతురుతో అల్లు అర్జున్ కారు షికారు, ఆశ్చర్య పరిచిన అర్హ విన్యాసాలు!
Recommended Video

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి గణేష్ చతుర్థి వేడుకలను హ్యాపీగా జరుపుకున్నారు. రోజంతా ఆయన తన భార్య పిల్లలతో గడపటానికే కేటాయించారు. ఉదయం పూట పూజా కార్యక్రమాలతో బిజీగా గడిపిన బన్నీ... సాయంత్రం కుటుంబ సభ్యులతో గడిపారు. రాత్రి తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ రోడ్లపై షికార్లు కొట్టారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
క్యూట్ వీడియో
మేము వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం... అంటూ స్నేహారెడ్డి ఈ వీడియో పోస్టు చేశారు. కారు రూఫ్ టాప్ నుండి తన కూతురు సంతోషంతో కేరింతలు కొడుతూ అందరికీ హాయ్ చెబుతూ విన్యాసాలు చేస్తుంటే అది చూసి అల్లు అర్జున్ మురిసిపోయారు.

అయాన్ ఫేవరెట్ బాహుబలి పాట
కారులో వెళుతూ బాహుబలి మూవీలోని అయాన్ ఫేవరెట్ సాంగ్ ‘దండాలయ్యా' పాట వింటున్నామని... స్నేహారెడ్డి పేర్కొన్నారు. రెండు గంటల క్రితం స్నేహారెడ్డి ఇన్‌స్టాలో ఈ వీడియో పోస్టు చేయగా దాదాపు లక్ష మంది వీక్షించారు. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో ఈ వీడియోను వైరల్ చేశారు.

అభిమానులకు శుభాకాంక్షలు
వినాయక చవితి సందర్భంగా బన్నీ దంపతులు తమ ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టి పూజించారు. ఈ సందర్భంగా అభిమానులకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్ సినిమా విషయానికొస్తే... ‘నా పేరు సూర్య' తర్వాత ఏ సినిమాకు అఫీషియల్‌గా కమిట్ కాలేదు. త్వరలో అతడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే స్టైలిష్ స్టార్ తన తర్వాతి సినిమా విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











