పూరి జగన్నాథ్‌కి లైటర్ ఎందుకు కొనిచ్చానంటే..

By Srikanya

హైదరాబాద్ : పూరి జగన్నాథ్‌కి నిర్మాత బండ్ల గణేష్ ...40 లక్షలు పెట్టి లైటర్ కొనివ్వడం విమర్శలకు దారి తీసింది. అసలు లైటరే ఎందుకు కొనాలనిపించింది అనే విషయమై గణేష్ వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లోనే... పూరి జగన్నాథ్‌తో నా అనుబంధం ఇరవయ్యేళ్లు పైనే. తన దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చేద్దామనుకున్నప్పుడు 'రెమ్యునేషన్ ఎంత కావాలి' అనడిగితే... 'నీ లాభాలను బట్టి' అన్నాడు. అలాంటి వ్యక్తి తను. ఆయనకు లైటర్స్ అంటే ఇష్టం. అది కొనిస్తే.. జేబులోనో, పర్సులోనే పెట్టుకుంటాడు. ఆ రకంగా ఆయనకు దగ్గరగా ఉన్నట్లవుతుందనుకుని కొన్నాను. ఆ సమయంలో అంతకు మించి వేరే ఏమీ ఆలోచించలేదు అన్నారు.

ఆదివారం గణేష్ పుట్టినరోజు. తను నిర్మిస్తున్న చిత్రాల గురించి చెబుతూ ... ''ఇరవయ్యేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్నాను. నిర్మాతగా మారడంతో నా కల నెరవేరింది. మరిన్ని మంచి సినిమాలు తీయడమే నా ముందున్న లక్ష్యం. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లతో కలిసి ఒకేసారి సినిమాలు తీయడం చక్కటి అనుభూతినిచ్చింది. భవిష్యత్తులో ప్రముఖ హీరోలందరితోనూ సినిమాలు తీయాలని ఉంది. ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదం అందించడమే నా బాధ్యతగా భావిస్తాను. మేలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది. పూరి జగన్నాథ్‌ మరో సినిమా కూడా ఉంటుంది''అన్నారు.

'ఇద్దరమ్మాయిలతో' గురించి చెపుతూ... ''వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రమిది. ఇద్దరమ్మాయిల మధ్య అల్లు అర్జున్‌ నటించడం ఇదే తొలిసారి. హీరోయిన్స్ తో ఆయన చేసిన సందడి ప్రేక్షకుల్ని మరింతగా అలరిస్తుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కీచా సమకూర్చిన పోరాట సన్నివేశాలు విభిన్నంగా ఉంటాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతానికి అల్లు అర్జున్‌ చేసిన నృత్యాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. బాలీవుడ్‌ నృత్య దర్శకుడు గణేష్‌ ఆచార్య ఓ పాటకి నృత్యాలు సమకూర్చారు. ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించాము''అన్నారు.

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. అమలాపాల్‌, కేథరిన్‌ కథానాయికలు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని శనివారం విడుదల చేశారు. మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X