భార్యకు నటుడు, మంత్రి గణేష్ కుమార్ విడాకులు

అందిన సమాచారం మేరకు - గణేష్ కుమార్ తిరువనంతపురంపోలని వఝుత్తకడ్‌లో ఉన్న నివాసాన్ని యామినికి ఇస్తున్నారు. గణేష్ కుమార్ ఆస్తిలో ఇరువురి పిల్లకు సగం వాటా వస్తుంది. చెన్నైలో ఫ్లాట్‌ను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ములో 80 శాతం యామినికి చెందుతుందని అంచనా.
పిల్లలను పెంచే హక్కు యామినికే ఉంటుంది. పిల్లలను గణేష్ కుమార్ కలుసుకునే విషయంలో ఏ విధమైన ఆంక్షలు లేవు. గణేష్ కుమార్ తండ్రి బాలకృష్ణ పిళ్లై కూడా మంత్రిగా పనిచేశారు. గణేష్ కుమార్ 1965 నవంబర్ 20వ తేదీన జన్మించారు.
కెజి జార్జ్ ఎరక్కల్ ద్వారా గణేష్ కుమార్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పలు టెలీ సీరియళ్లలో నటించారు. యామినితో విడాకుల వ్యవహారంపై రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది. గణేష్ కుమార్‌ను ఎప్పటికప్పుడు వివాదాలు చుట్టుముడతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











