twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్యకు నటుడు, మంత్రి గణేష్ కుమార్ విడాకులు

    By Pratap
    |

    Ganesh Kumar-Yamini
    తిరువనంతపురం: కేరళ అటవీ శాఖ మంత్రి, నటుడు ఎట్టకేలకు తన భార్య యామినితో విడాకులు తీసుకున్నారు. ఇరువురు విడివిడిగా కార్మిక శాఖ మంత్రి శిబు బేబీ జాన్ నివాసానికి వచ్చి విడాకుల పత్రాలపై సంతకాలు చేశారు. ఇరువురు విడివిడిగా వచ్చి సంతకాలు చేసి హడావిడిగా వెళ్లిపోయారు.

    అందిన సమాచారం మేరకు - గణేష్ కుమార్ తిరువనంతపురంపోలని వఝుత్తకడ్‌లో ఉన్న నివాసాన్ని యామినికి ఇస్తున్నారు. గణేష్ కుమార్ ఆస్తిలో ఇరువురి పిల్లకు సగం వాటా వస్తుంది. చెన్నైలో ఫ్లాట్‌ను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ములో 80 శాతం యామినికి చెందుతుందని అంచనా.

    పిల్లలను పెంచే హక్కు యామినికే ఉంటుంది. పిల్లలను గణేష్ కుమార్ కలుసుకునే విషయంలో ఏ విధమైన ఆంక్షలు లేవు. గణేష్ కుమార్ తండ్రి బాలకృష్ణ పిళ్లై కూడా మంత్రిగా పనిచేశారు. గణేష్ కుమార్ 1965 నవంబర్ 20వ తేదీన జన్మించారు.

    కెజి జార్జ్ ఎరక్కల్ ద్వారా గణేష్ కుమార్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పలు టెలీ సీరియళ్లలో నటించారు. యామినితో విడాకుల వ్యవహారంపై రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది. గణేష్ కుమార్‌ను ఎప్పటికప్పుడు వివాదాలు చుట్టుముడతూనే ఉన్నాయి.

    English summary
    Minister and Actor Ganesh Kumar finally divorced his long time wife Yamini. Both reached labour minister Shibu Baby John's residence on Tuesday night and signed a joint divorce contract. The two reached separately and left soon after signing the papers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X