గణేష్...మహరాజ్ కీ జై
శరవణన్ దర్శకుడిగా తొలి పరిచయం అవుతూ, నిర్మాత రవికిషోర్ నిర్మానంలో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'గణేష్". రామ్ కథానాయకుడు. కాజల్ కథానాయిక. జస్ట్ గణేష్ అనేది ఉపశీర్షిక. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల అరకులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించామన్నారు. మిగిలిన పతాక సన్నివేశాలను, పాటలను ఈ షెడ్యూల్లో తెరకెక్కిస్తాం అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో వీటిని చిత్రీకరించడం తో సినిమా పూర్తవుతుంది. త్వరలో ఆడియో, వచ్చేనెలలో సినిమాను విడుదల చేస్తాం. రామ్ కి చిన్నారుల్లో మంచి ఆదరణ ఉంది. ఈ సినిమాలోనూ వారిని ఆకట్టుకునే సన్నివేశాలు చాలానే ఉంటాయి. గణేష్...మహరాజ్ కీ జై అంటూ చిన్నారులు జై కొట్టే విధంగా తెరకెక్కించామని చెప్పారు. ఈ సినిమాకు సంగీతాన్ని మిక్కీ జె. మేయర్ అందించారు.
ganesh ram kajal saravanan ravikishore sri sravanthi movies ready magadheera గణేష్ శరవణన్ రవికిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ రామ్ కాజల్ మిక్కీ జె మేయర్ హైదరాబాద్


Click it and Unblock the Notifications