»   » నయనతార రూమర్ లవర్....పెళ్లి ఫిక్సయింది (ఫోటో)

నయనతార రూమర్ లవర్....పెళ్లి ఫిక్సయింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక ఎఫైర్ రూమర్ తిరుగుతూనే ఉంటుంది. శింబుతో మొదలై చాలా మందితో ఆమె ఎపైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఇలాంటి వార్తలపై స్పందించిన నయనతార తాను జీవితంలో ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి ప్రభుదేవా మాత్రమే. తర్వాత విడిపోయారు. ఇతరలతో తాను ప్రేమాయణం నడిపినట్లు వచ్చిన వార్తలు కేవలం రూమర్లే అని తేల్చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ మద్య జయం రవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో సెకండ్ హీరోగా నటిస్తున్నగణేష్ వెంట్రామన్ తో కూడా నయనతార సన్నిహితంగా మెలుగుతుండటంతో ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ రిలేషన్ షిప్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని తేలాయి.

Ganesh Venkatraman found His Life Partner

గణేష్ వెంకట్రామన్ తెలుగులో డమరుకం, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించాడు. త్వరలో ఇతను ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. బుల్లితెర నటి నిషాను అతను పెళ్లాడ బోతున్నాడు. ఈ విషయాన్ని గణేష్ వెంకట్రామన్ ఖరారు చేసారు. ఈ సంవత్సరాంతంలో తాము పెళ్లి చేసుకుంటామని తెలిపాడు.

గత కొంతకాలంగా గణేష్, నిషా ప్రేమలో ఉన్నారు. పెద్ద అంగీకారం కూడా తోడవటంతో ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రకటించారు. పెళ్లి వేడుకను గ్రాండ్ గా జరుపుకునేందుకు ఇద్దరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లికి చాలా సమయం ఉండటంతో పర్ ఫెక్టు ప్లానింగుతో ముందుకు సాగుతున్నారు.

English summary
Hit and handsome kollywood star who Ganesh Venkatraman who starred in Telugu films like Eenadu, Damarukam, Something Something is all set to enter into wedlock. Ganesh who is in love with Nisha, small screen actress confirmed the news. He will be marrying Nisha this year end.
Please Wait while comments are loading...