గబ్బర్‌ సింగ్ నిర్మాత కోడి గుడ్డు స్టోరీ..!

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తీన్ మార్' చిత్రాన్ని నిర్మించింది కూడా ఇతడే. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో చిత్రాని కూడా నిర్మిస్తున్నాడు ఈ నిర్మాత.

బండ్ల గణేష్ కోడిగుడ్డు స్టోరీ ఏమిటంటే....ఇతగాడు తాజాగా నేషనల్ ఎగ్ సెంటర్ కమిటీ(ఎన్ఇసిసి) మెంబర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ''అందరి సహకారంతో చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా పేరు సంపాదించుకున్న నేను నేషనల్ ఎగ్ సెంటర్ కమిటీ మెంబర్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది, 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల పాటు ఎన్ఇసిసి మెంబర్‌గా నా సేవల్ని అందిస్తాను'' అన్నారు.

పవర్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, శృతి హీసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి 'యాక్షన్' లేదే 'బాద్‌షా' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X