30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు

మెగాస్టార్ చిరంజీవి 40ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరచిపోలేని అనుభూతులు ఉన్నాయి. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా మొదట నుంచి జనాల్లో తెలియని ఎట్రాక్షన్ ను క్రియేట్ చేస్తూ వస్తోంది. ఇన్నేళ్ల సినిమా కెరీర్ కు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను కూడా మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఫొటో మాత్రం బాగా వైరల్ అయ్యింది.

Recommended Video

Gang Leader Brothers Reunion In Acharya Sets | Megastar Chiranjeevi | Filmibeat Telugu
 స్పీడ్ లో ఉన్న మెగాస్టార్

స్పీడ్ లో ఉన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి జీవితంలో కేవలం అద్భుతమైన నటనే కాకుండా మంచి క్రమశిక్షణ కూడా ఆయన కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది. చేసిన ప్రతి సినిమా వల్ల ఎంతో మందితో పరిచయం ఏర్పడుతుంది. 151 సినిమాలు పూర్తి చేసిన మెగాస్టార్ మరో 100 సినిమాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయలన్నంత స్పీడ్ లో వెళుతున్నారు.

సెన్సేషన్ ను క్రియేట్ చేసిన సినిమా

సెన్సేషన్ ను క్రియేట్ చేసిన సినిమా

ఇక మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. మెగాస్టార్ కు అత్యంత సన్నిహిత దర్శకుల్లో ఒకరైన విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో అలా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. 1991లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మెగాస్టార్ అన్నయ్యలుగా

మెగాస్టార్ అన్నయ్యలుగా

ఆ సినిమాలో మర్చిపోలేని అంశాలు చాలానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు అలాగే సినిమాకు బప్పీ లహరి అందించిన పాటలు బిగెస్ట్ హిట్. ఏ విషయంలోను సినిమా నిరాశపరిచింది లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్. అయితే సినిమాలో మెగాస్టార్ కు అన్నయ్యలుగా మురళి మోహన్, శరత్ కుమార్ పాత్రలు మెయిన్ హైలెట్.

30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో

30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో

ఇక దాదాపు 30 ఏళ్ళ తరువాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి, శరత్ కుమార్, మురళి మోహన్ ఒకే చోట కలుసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుండగా మురళి మోహన్ మరో సినిమా ప్రొడక్షన్ లో బిజీగా అక్కడే ఉన్నారు. ఇక శరత్ కుమార్ మణిరత్నం. పొన్నియిన్ సెల్వన్ తో అక్కడే ఉండడంతో ఇలా ముగ్గురు ఒకేచోట కలుసుకొని ఫొటోకి పొజిచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X