twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందర్భం: అప్పట్లో చిరుకి బంగారు కిరీటం, విజయశాంతి కోసం గ్రాండ్ పార్టీ!

    ఈ రోజుతో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలై సరిగ్గా 26 సంవత్సరాలు. 150 సినిమాల మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో తప్పకుండా మాట్లాడుకోవాల్సిన సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటి.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారతదేశ సినీ చరిత్రలో స్వర్ణ కిరీట ధారణ చేయబడిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. గ్యాంగ్ లీడర్ శతదినోత్సవం 1991 ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున జరుగ్గా ఈ సందర్భంగా ఆయనకు స్వర్ణ కిరీట ధారణ చేసారు.

    గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ సయమంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విజయశాంతి కర్తవ్యం సినిమాకుగాను ఉత్తమ నటి అవార్డు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో చిరంజీవి కోసం పెద్ద పార్టీ అరేంజ్ చేసారు మెగాస్టార్.

    ఈ రెండు సంఘటనలను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఏమిటంటే.... ఈ రోజుతో 'గ్యాంగ్ లీడర్' సినిమా విడుదలై సరిగ్గా 26 సంవత్సరాలు. 150 సినిమాల మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో తప్పకుండా మాట్లాడుకోవాల్సిన సినిమాల్లో 'గ్యాంగ్ లీడర్' ఒకటి. అప్పట్లో ఈచిత్రం తెలుగు నాట సంచలన విజయం సాధించింది.

    ఈ సినిమాతో చిరంజీవి రేంజి పెరిగింది

    ఈ సినిమాతో చిరంజీవి రేంజి పెరిగింది

    గ్యాంగ్ లీడర్ సినిమా అఖండ విజయంతో తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి రేంజి మరింత పెరిగింది. ఈ సినిమా కేవలం చిరంజీవి కెరీర్లో మాత్రమే కాదు.... తెలుగు సినిమా రంగంలో గొప్ప విజయం అందుకున్న సినిమాల్లో ఇదీ ఒకటి.

    విజయోత్సవం కోసం ప్రత్యేక విమానం

    విజయోత్సవం కోసం ప్రత్యేక విమానం

    1991 ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘గ్యాంగ్ లీడర్' శతదినోత్సవ వేడుకలను ‘డోరినార్' అనే చార్టర్డ్ విమానంలో యూనిట్ మొత్తం తిరుపతి, ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ లలో పర్యటించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

    స్వర్ణ కిరీటం

    భారతదేశ సినీ చరిత్రలో స్వర్ణ కిరీట ధారణ చేయబడిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. నిర్మాత ఏకంగా బంగారు కిరీటం తయారు చేయించాడంటే ఈ సినిమాకు లాభాలు ఏ రేంజిలో వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

    విజయశాంతి కోసం పార్టీ

    విజయశాంతి కోసం పార్టీ

    గ్యాంగ్ లీడర్ కోసం భద్రాచలం కొండ పాట షూటింగ్ చేస్తున్న సమయంలో 'కర్తవ్యం' చిత్రానికి తనకు ఉత్తమనటి అవార్డు వచ్చిందనే విషయం తెలిసిందని, దీంతో ఆ సాయంత్రమే చిరంజీవి గారు పెద్ద పార్టీ అరేంజ్ చేసి చిరు ఫ్యామిలీతో పాటు గోవిందా - దివ్యభారతిలను కూడా పిలిచారని విజయశాంతి గతంలో ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.

    మెగా మనసు

    మెగా మనసు

    చిరంజీవి గారు హీరోయిన్లకు ఆయన ఎంతో గౌరవం ఇచ్చే వారని, తెలుగు సినిమా రంగంలోని గొప్ప యాక్టర్లలో ఒకరు చిరంజీవి ఒకరు. రంజీవికి కొన్ని విషయాల్లో సాటిరాగల వ్యక్తులు ఇప్పటికీ లేరని విజయశాంతి గతంలో ఓ సారి వెల్లడించారు.

    English summary
    The film that marked the complete and utter domination of Megastar Chiranjeevi in united Andhra Pradesh, Gangleader, completed 26 years today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X